News March 20, 2025
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వర స్వామి భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,388 మంది దర్శించుకోగా.. 26,145 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
Similar News
News March 21, 2025
BREAKING: పోసానికి బెయిల్ మంజూరు

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో సినీనటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. CID కేసులో ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. త్వరలో ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పోసాని 5 కేసుల్లో అరెస్ట్ అవగా అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది.
News March 21, 2025
నంది అవార్డులను పునరుద్ధరించాలి: నిర్మాతల మండలి

APలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామని నిర్మాతల మండలి తెలిపింది. విశాఖ, రాజమండ్రి, తిరుపతిలో స్టూడియోలు నిర్మించాలని, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరామంది. నంది అవార్డులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. సినీ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కోసం కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రులు లోకేశ్, దుర్గేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
News March 21, 2025
ఎన్నాళ్లకెన్నాళ్లకో ఈ మురిపెం!

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు భారీగా లాభపడ్డాయి. ఈ వారం వరుసగా 5 సెషన్లలోనూ అదరగొట్టాయి. కొన్ని నెలల తర్వాత బెంచ్‌మార్క్ సూచీలు ఒక వారమంతా లాభపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. గత ఏడాది నవంబర్ నాటి పుల్‌బ్యాక్ ర్యాలీలో చివరిసారిగా ఈ ఫీట్ నమోదైంది. NOV 29 నుంచి DEC 5 వరకు సూచీలు వరుసగా ఎగిశాయి. నిఫ్టీ ప్రస్తుత 23,300 స్థాయిలో కన్సాలిడేట్ అయితే మార్కెట్ వర్గాల్లో పాజిటివ్ సెంటిమెంటు మరింత బలపడుతుంది.