News March 20, 2025
మహబూబ్నగర్లో కానిస్టేబుల్ సూసైడ్

మహబూబ్నగర్లో ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. సీఐ అప్పయ్య తెలిపిన వివరాలిలా.. స్థానిక గౌడ్స్ కాలనీలో నివాసముంటున్న 2009 బ్యాచ్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్(38) ఏడాది క్రితం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News March 21, 2025
మంత్రి ఫరూక్ సతీమణి మృతి బాధాకరం: నంద్యాల ఎంపీ

న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ సతీమణి మృతి చాలా బాధిస్తోందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఫరూక్ సతీమణి షహనాజ్ అకాల మరణం వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని శబరి పేర్కొన్నారు. మంత్రి కుటుంబానికి అల్లా తోడుగా ఉండాలని ఎంపీ శబరి తెలిపారు.
News March 21, 2025
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉష్ణోగ్రతలు

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రలోని గడిచిన 24 గంటల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. నాగర్ కర్నూల్లో 38.9 ఉష్ణోగ్రత నమోదయింది. అటు తెలకపల్లి 38.9, కొల్లాపూర్ 38.9, పెద్దకొత్తపల్లి, అచ్చంపేట్ 38.8, బిజినపల్లి, వంగూరు 38.6, వెల్దండ, ఉప్పుగుంతల, కల్వకుర్తి 38.2, పదర, అచ్చంపేట 38.1 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 21, 2025
యాదాద్రి: ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు

జిల్లాలో 10వ తరగతి పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకుని పరీక్ష హాల్లోకి వెళ్లారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనుంది.