News March 20, 2025
మహబూబ్‌నగర్‌లో కానిస్టేబుల్ సూసైడ్

మహబూబ్‌నగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. సీఐ అప్పయ్య తెలిపిన వివరాలిలా.. స్థానిక గౌడ్స్ కాలనీలో నివాసముంటున్న 2009 బ్యాచ్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్(38) ఏడాది క్రితం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News March 21, 2025
యాదాద్రి: ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు

జిల్లాలో 10వ తరగతి పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకుని పరీక్ష హాల్లోకి వెళ్లారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనుంది.
News March 21, 2025
విశాఖలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

విశాఖలో ఇంటర్ విద్యార్థి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. GRP పోలీసుల వివరాల ప్రకారం.. కంచరపాలెంలోని ఇందిరానగర్‌లో నివాసముంటున్న అంబటి రేవంత్ కుమార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పరీక్షలు సరిగా రాయలేదంటూ మనస్తాపం చెందాడు. ఈక్రమంలోనే బుధవారం అర్ధరాత్రి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 21, 2025
హనీట్రాప్: కర్ణాటక కాంగ్రెస్‌లో చీలిక!

కర్ణాటకలో 48 మంది నేతలు హనీట్రాప్‌లో చిక్కినట్టు స్వయంగా కాంగ్రెస్ మంత్రే బయటపెట్టడం అనుమానాలకు తావిస్తోంది. కొందరు మంత్రులు, MLAలు వలపు వలలో చిక్కారని, దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేయడం వర్గపోరుకు నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. సొంతపార్టీ నేతలపై విచారణ కోరడమే ఇందుకో ఉదాహరణగా చెప్తున్నారు. CM సిద్దరామయ్య, DYCM శివకుమార్ విభేదాలు పార్టీలో చీలికను సూచిస్తున్నాయని పేర్కొంటున్నారు. మీరేమంటారు?