News March 20, 2025

మహబూబ్‌నగర్‌లో కానిస్టేబుల్ సూసైడ్

image

మహబూబ్‌నగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. సీఐ అప్పయ్య తెలిపిన వివరాలిలా.. స్థానిక గౌడ్స్ కాలనీలో నివాసముంటున్న 2009 బ్యాచ్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్(38) ఏడాది క్రితం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News March 21, 2025

NLG: అతడు అడవిని సృష్టించాడు!

image

ఎకరం పొలం ఉంటేనే ఏ పంట వేద్దాం, కౌలుకు ఇస్తే ఎంతొస్తది? అని లెక్కలేసుకునే రోజులివి. కానీ, హైవే‌కు ఆనుకొని ఉన్న 70 ఎకరాల భూమిలో మూగజీవాలకు ఆవాసంగా మార్చేశారో ప్రకృతి ప్రేమికుడు. రూ.కోట్ల విలువ చేసే భూమిని అడవిగా మార్చేశారు. ఒక్కరోజులో జరిగిన పరిణామం కాదు. ఏకంగా 60 ఏళ్లు శ్రమించి 5 కోట్ల వరకు వృక్షాలను పెంచి ఆదర్శంగా నిలిచారు. ఆయనే మన రాఘవాపురం దుశ్చర్ల సత్యనారాయణ.
నేడు International Forest Day

News March 21, 2025

కడప MP అవినాశ్‌కి కీలక బాధ్యత.!

image

పార్లమెంట్ ఎస్టిమేట్ (అంచనాల) కమిటీ సభ్యునిగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ అంచనాల కమిటీ పార్లమెంటులో అత్యున్నతమైన కమిటీ. దేశం మొత్తం మీద 543 పార్లమెంట్ సభ్యుల నుంచి 30 మందిని ఎన్నుకుంటారు. ఇందులో భాగంగా.. వైఎస్సార్సీపీ నుంచి కడప జిల్లా పార్లమెంట్ సభ్యులు YS అవినాశ్ రెడ్డి ఎన్నికవ్వడం చాలా సంతోషమని కార్యకర్తలు తెలిపారు.

News March 21, 2025

మంత్రి ఫరూక్ సతీమణి మృతి బాధాకరం: నంద్యాల ఎంపీ

image

న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ సతీమణి మృతి చాలా బాధిస్తోందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఫరూక్ సతీమణి షహనాజ్ అకాల మరణం వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని శబరి పేర్కొన్నారు. మంత్రి కుటుంబానికి అల్లా తోడుగా ఉండాలని ఎంపీ శబరి తెలిపారు.

error: Content is protected !!