News March 20, 2025
మంచిర్యాల: ఆ ఉపాధ్యాయుడే కీచకుడు

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల కీచకంగా మారుతున్నారు. మంచిర్యాల గర్ల్స్ హై స్కూల్‌లో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి అరెస్టు అయ్యాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ నిర్మల్(D) నర్సాపూర్ (జి)లో గణిత ఉపాధ్యాయుడు, సాయికుంట ఆశ్రమ పాఠశాల, భీమిని పాఠశాలలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
Similar News
News March 21, 2025
యాదాద్రి: 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువ కెరటం!

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు ఏలే నరసింహ-పారిజాతల కుమారుడు ఏలే సుభాష్ చంద్రబోస్ చదువుల్లో ప్రతిభ కనబరుస్తూ ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. పురావస్తు శాఖ, రైల్వే శాఖ, పోస్టల్ అసిస్టెంట్, గ్రూప్-4 మున్సిపల్ శాఖలో ఉద్యోగాలు సాధించాడు. ఇటీవల SSC-CGLలో మంచి ర్యాంక్ సాధించి కేంద్ర రక్షణ శాఖలో ఆడిటర్ ఉద్యోగమూ దక్కించుకున్నాడు.
News March 21, 2025
MBNR: పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 24 వరకు పెంపు

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీలలో 2వ, 4వ&6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈ నెల 20 వరకు గడువు ముగియనుండగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 24వరకు, ఆలస్య రుసుముతో ఈనెల 27 వరకు గడువు పెంచుతున్నట్లు కాలేజీలకు అధికారులు తెలిపారు. ఇంకా ఫీజు చెల్లించని రెగ్యులర్, బ్యాక్‌లాగ్ విద్యార్థుల నిమిత్తమే ఫీజు చెల్లింపు గడువు పెంచినందుకు డిగ్రీ విద్యార్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు. SHARE IT.
News March 21, 2025
దిలావర్పూర్: తాగునీటికోసం ‘భగీరథ’ ప్రయత్నం

గ్రామాల్లో తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. వేసవి కాలంలో అడుగంటుతున్న భూగర్భ జలాలు సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. ఇంటింటికి నల్లా నీరు అంటూ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం అధికారుల నిర్లక్ష్యంతో ప్రయోజనం లేకుండా పోతోంది. ఇంటింటికీ భగీరథ నీరు పంపిణీ కావడం లేదు. గ్రామస్థులు మీటరు లోతు వరకు తవ్వి భగీరథ నీటిని పట్టుకుంటున్నారు. తాగు నీటికోసం ప్రజలకు ‘భగీరత’ ప్రయత్నం చేయక తప్పడం లేదు.