News March 20, 2025

వికారాబాద్: పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు

image

వికారాబాద్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 2వ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 12,903మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 6,450 మంది బాలురు, 6,453 మంది బాలికలు ఉన్నారు. 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

Similar News

News March 21, 2025

మంత్రి ఫరూక్ సతీమణి మృతి బాధాకరం: నంద్యాల ఎంపీ

image

న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ సతీమణి మృతి చాలా బాధిస్తోందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఫరూక్ సతీమణి షహనాజ్ అకాల మరణం వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని శబరి పేర్కొన్నారు. మంత్రి కుటుంబానికి అల్లా తోడుగా ఉండాలని ఎంపీ శబరి తెలిపారు.

News March 21, 2025

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉష్ణోగ్రతలు

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రలోని గడిచిన 24 గంటల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. నాగర్ కర్నూల్‌లో 38.9 ఉష్ణోగ్రత నమోదయింది. అటు తెలకపల్లి 38.9, కొల్లాపూర్ 38.9, పెద్దకొత్తపల్లి, అచ్చంపేట్ 38.8, బిజినపల్లి, వంగూరు 38.6, వెల్దండ, ఉప్పుగుంతల, కల్వకుర్తి 38.2, పదర, అచ్చంపేట 38.1 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

News March 21, 2025

యాదాద్రి: ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు

image

జిల్లాలో 10వ తరగతి పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకుని పరీక్ష హాల్లోకి వెళ్లారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనుంది.

error: Content is protected !!