News March 20, 2025

కలిదిండి: గేట్‌లో 9వ ర్యాంకు సాధించిన సాయిచరణ్

image

కలిదిండి(M) ఆరుతెగలపాడు గ్రామానికి చెందిన చిలుకూరి సాయిచరణ్ ఆల్ ఇండియా గేట్ ప్రవేశ పరీక్షలో 9వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. గతేడాది కాకినాడ JNTUలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సాయిచరణ్.. గేట్ ప్రవేశ పరీక్ష కోసం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే 9వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని సాయిచరణ్ తెలిపారు. ఐఐటీ చదవాలన్న తన ఆశయానికి తండ్రి కిశోర్, తల్లి పల్లవి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారన్నారు.

Similar News

News July 5, 2025

పీఎం కిసాన్ పేరిట మోసాలు.. తాండూర్ డీఎస్పీ ALERT

image

పీఎం కిసాన్ యోజన పేరిట జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తాండూర్ DSP బాలకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రజలకు అవేర్నెస్ కల్పించే పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం ఇదే చివరి అవకాశం అంటూ వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్‌లను నమ్మి వచ్చిన లింకులను క్లిక్ చేయొద్దన్నారు. పథకానికి అప్లై చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్, అధికారులను మాత్రమే ఆశ్రయించాలన్నారు.

News July 5, 2025

GWL: కట్టుకున్న వారే కడతేర్చుతున్నారు!

image

జీవితాంతం కలిసుంటామని పెళ్లిలో ప్రమాణం చేసిన భార్యాభర్తలు కట్టుకున్న వారినే కడ తేర్చుతున్నారు. నడిగడ్డలో ఇటీవల జరిగిన ఘటనలు వణుకుపుట్టిస్తున్నాయి. GWLలో తేజేశ్వర్‌ను భార్య ఐశ్వర్య తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని హత్య చేయించింది. అయిజ మాలపేటలో మాజీ భార్య సరోజ ప్రవర్తన సరిగా లేదని, కుమారుడికి పెళ్లి కావడంలేదని తండ్రీకొడుకులు కలిసి హత్య చేశారు. దీంతో పెళ్లిచేసుకోవాలంటేనే యువతలో భయం పుడుతోంది.

News July 5, 2025

ఆ 11 మంది ఏమయ్యారు?

image

TG: పాశమైలారం సిగాచీ కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో 11 మంది ఆచూకీ లభించడంలేదు. 39 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించగా, కనిపించకుండా పోయినవారి శరీర భాగాల్లో చిన్న ముక్క కూడా దొరకలేదు. దీంతో వారు కాలి బూడిదయ్యారా? లేక ఏమయ్యారు? అనేది తెలియడంలేదు. వారి అవశేషాల కోసం ఘటనాస్థలంలో మరోసారి వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో బాధిత కుటుంబీకులకు ఏం చెప్పాలో తెలియక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.