News March 20, 2025
యువతిపై రేప్.. వీడియో తీసిన మరో యువతి

TG: సూర్యాపేట (D) హుజూర్‌నగర్‌లో ఓ యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హుజూర్‌నగర్‌కు చెందిన రోజా తన స్నేహితురాలి(26)ని ఇంటికి పిలిచింది. ఆపై మద్యం తాగించి మత్తులోకి వెళ్లాక రోజా ప్రియుడు ప్రమోద్ ఆ యువతిపై అత్యాచారం చేయగా ఆమె వీడియో తీసింది. బుధవారం మరోసారి ఆ యువతికి ఫోన్ చేసి పిలిపించారు. ఈ సారి తన ఫ్రెండ్ హరీశ్ కోరిక తీర్చాలని ప్రమోద్ కోరగా ఆమె నిరాకరించి పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News January 5, 2026
మహిళలూ 35ఏళ్లు దాటాయా?

35ఏళ్లు దాటిన తర్వాత మహిళల ఎముకల సాంద్రత తగ్గుతూ, ఎముకలు గుల్లబారడం మొదలవుతుంది. ఇదే ఆస్టియొపొరోసిస్. ఇలా కాకుండా ఉండాలంటే 35 ఏళ్ల వరకూ ప్రతిరోజూ పావు లీటరు పాలు, పాల ఉత్పత్తులు తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మెనోపాజ్ వరకూ ఎముకల అరుగుదలను నియంత్రించవచ్చు. ఆ తర్వాత క్యాల్షియం సప్లిమెంట్ల అవసరం రావొచ్చు. అప్పుడు కూడా సొంతంగా సప్లిమెంట్లు కొనేసి వాడేయకుండా, వైద్యుల సూచనలను పాటించాలి.
News January 5, 2026
మిగిలింది 17 మంది మావోయిస్టులే.. పోలీసుల రిపోర్ట్

TG: 17 మంది కీలక మావోయిస్టు నేతలు మాత్రమే రాష్ట్రంలో మిగిలి ఉన్నట్టు కేంద్రానికి పంపిన రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. వారు కూడా లొంగిపోతే మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారుతుందన్నారు. అజ్ఞాతంలో ఉన్న వారిలో ముప్పాల లక్ష్మణ్ రావు (గణపతి), తిప్పిరి తిరుపతి (దేవ్ జీ), మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్), పసునూరి నరహరి (సంతోష్) సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు. అందరిపైనా రూ.2కోట్ల 25లక్షల రివార్డు ఉంది.
News January 5, 2026
ఎవరో ఎందుకు.. సమస్యను మనమే పరిష్కరించుకోలేమా?

AP-TG మధ్య నదీ జలాల వివాదాలు మళ్లీ ముదురుతున్నాయి. వీటి పరిష్కారానికి కేంద్రం ఓ కమిటీని ఏర్పాటుచేయగా, నల్లమల సాగర్‌పై ప్రభుత్వాలు సుప్రీంకోర్టు మెట్లెక్కాయి. అయితే తెలుగువారి ఆత్మగౌరవమంటూ బీరాలు పలికే నాయకులు, మేధావులు కూర్చుని ఓ పరిష్కారానికి ఎందుకు ప్రయత్నించట్లేదు? ఢిల్లీవాళ్లే వివాదాన్ని తేల్చాలా? కడలిపాలయ్యే నీళ్లను ఉపయోగించుకునే తెలివితేటలు మనకు లేవా? సమాధానం చెప్పేదెవరు?


