News March 20, 2025
సామర్లకోట : రైలు దిగుతూ జారి పడి వ్యక్తి మృతి

కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో రైలు నుంచి దిగుతూ ఒక యువకుడు మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి పెద్దాపురానికి చెందిన సిమ్ము సిరి త్రినాథ్ తల్లి విజయలక్ష్మి విశాఖపట్నం ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. నిద్రమత్తులో ఉన్న త్రినాథ్ రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించి, ప్రమాదానికి గురయ్యాడు. రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 21, 2025
ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

వేసవి నేపథ్యంలో ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. తలనొప్పి, తల తిరగటం, తీవ్రమైన జ్వరం కలిగియుండటం, మత్తు నిద్ర కలవరింతలు, ఫిట్స్, లేదా పూర్తి అపస్మారక స్థితి ఉంటుందని, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తెలుపు రంగు గల కాటన్ వస్త్రాలను ధరించాలని అన్నారు. తలకు టోపి పెట్టుకోవాలని, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోస్ కలిపిన నీటిని తాగాలని సూచించారు.
News March 21, 2025
IPL కామెంటేటర్‌గా ఇండియన్ అంపైర్

భారత్‌కు చెందిన అంపైర్ అనిల్ చౌదరి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక నుంచి కామెంటేటర్‌గా కొనసాగనున్నారు. ఢిల్లీకి చెందిన ఆయన 2013-2025 వరకు 12 టెస్టులు, 49 ODIs, 64 T20s, 131 IPL, 91 ఫస్ట్ క్లాస్, 114 లిస్ట్-A మ్యాచులకు అంపైరింగ్ చేశారు. ఇలా అంతర్జాతీయ మ్యాచులకు అంపైర్‌గా చేసి ఫుల్ టైమ్ కామెంటేటర్‌గా మారిన తొలి భారత అంపైర్‌గా నిలిచారు. ఇప్పుడు IPLలో హర్యాన్వి, హిందీలో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
News March 21, 2025
మంత్రి ఫరూక్ సతీమణి మృతి.. సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం

మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షహనాజ్ మృతికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. షహనాజ్ మృతితో విషాదంలో ఉన్న ఫరూక్ కుటుంబానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సానుభూతిని తెలిపారు. కాగా, కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఉన్న ఆమె ఇవాళ హైదరాబాద్‌లోని వారి నివాసంలో మృతిచెందారు.