News March 20, 2025
హనుమకొండ: నేడు ప్రారంభం కానున్న పండ్ల మార్కెట్

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ముసలమ్మకుంట గోదాముల వద్ద ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌ను గురువారం మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు ప్రారంభిస్తారని మార్కెట్ కార్యదర్శి గుగులోతు రెడ్యా తెలిపారు. ఈ మేరకు మామిడికాయల సీజన్ ప్రారంభమైనందున ముసలమ్మకులో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.
Similar News
News March 21, 2025
76 ఏళ్ల వయసులో తల్లయిన మహిళ

ఇథియోపియా దేశంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. మెకెల్లే ప్రాంతానికి చెందిన మెధిన్ హాగోస్ అనే మహిళ 76 ఏళ్ల వయసులో మగబిడ్డకు జన్మనిచ్చారు. తాను సహజ పద్ధతిలోనే గర్భం దాల్చినట్లు ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండగా, ఇంత లేటు వయసులో సహజంగా గర్భం దాల్చడం సాధ్యం కాకపోవచ్చని పలువురు నెటిజన్లు అంటున్నారు. IVF విధానంలో ప్రెగ్నెంట్ అయ్యుంటారని కామెంట్స్ చేస్తున్నారు.
News March 21, 2025
ములుగు: పని పట్ల మంత్రి సీతక్క నిబద్ధత

ఎంతో పని ఒత్తిడి అసెంబ్లీ సమావేశాలున్నా శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నరకే ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయానికి మంత్రి సీతక్క చేరుకున్నారు. ఉదయం 9.45వరకు అధికారులతో జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్, తాగు నీటి పంపిణిపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం శాసన మండలికి చేరుకుని బడ్జెటపై జరిగిన చర్చలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.
News March 21, 2025
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా డబ్బింగ్ స్టార్ట్ అయినట్లు మూవీ యూనిట్ పేర్కొంది. సాటిలేని హీరోయిజం ప్రయాణం వెండి తెరకు మరింత చేరువైనట్లు పేర్కొంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రానికి కొంత భాగం క్రిష్ దర్శకత్వం వహించగా మిగతా భాగాన్ని తెరకెక్కించే బాధ్యత జ్యోతి కృష్ణ తీసుకున్నారు. కాగా ఈ మూవీ మే 9న థియేటర్లలో విడుదల కానుంది.