News March 20, 2025

హైదరాబాద్‌ మెట్రో స్టేషన్లలో రద్దీ

image

సమ్మర్ ఎఫెక్ట్‌తో నగరవాసులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. గురువారం ఉ. అమీర్‌పేట స్టేషన్‌‌కు ప్రయాణికులు క్యూ కట్టారు. ప్లాట్‌ఫాం పూర్తిగా నిండిపోయింది. రాయదుర్గ్ రూట్‌లో వెళ్లేవారికి నిరీక్షణ తప్పలేదు. ట్రైయిన్‌‌లో కిక్కిరిసి ప్రయాణించారు. డ్యూటీకి వెళ్లేవారు అసౌకర్యానికి గురయ్యారు. ఇలా అయితే ఎలా పోవాలి అయ్యా ఆఫీస్‌కి అంటూ ఓ నెటిజన్ @ltmhydని ప్రశ్నించారు. ఇకనైనా సర్వీసులు పెంచాలని కోరుతున్నారు.

Similar News

News March 21, 2025

పకడ్బందీగా పది పరీక్షలు: ఎస్పీ

image

పదవ తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించి బందోబస్తును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News March 21, 2025

యశ్వంత్ వర్మపై విచారణకు సుప్రీం ఆదేశం

image

ఢిల్లీ హైకోర్టు జడ్జి <<15834106>>యశ్వంత్ వర్మ<<>> ఇంట్లో భారీగా నగదు బయటపడిన వ్యవహారంపై సుప్రీం కోర్టు అంతర్గత విచారణకు ఆదేశించింది. హైకోర్టు సీజే నుంచి నివేదిక కోరింది. వర్మ నివాసంలో రూ.50కోట్ల వరకు నగదు బయటపడినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఈ డబ్బంతా ఎవరిదన్న కోణంలోనూ దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. కాగా వర్మపై ఇప్పటికే బదిలీ వేటు పడింది.

News March 21, 2025

ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

image

వేసవి నేపథ్యంలో ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. తలనొప్పి, తల తిరగటం, తీవ్రమైన జ్వరం కలిగియుండటం, మత్తు నిద్ర కలవరింతలు, ఫిట్స్, లేదా పూర్తి అపస్మారక స్థితి ఉంటుందని, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తెలుపు రంగు గల కాటన్ వస్త్రాలను ధరించాలని అన్నారు. తలకు టోపి పెట్టుకోవాలని, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోస్ కలిపిన నీటిని తాగాలని సూచించారు.

error: Content is protected !!