News March 20, 2025

గద్వాల్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి

image

గద్వాల్ జిల్లాలో జిల్లాలో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. బుధవారం అలంపూర్‌లో గరిష్ఠంగా 40.3, గద్వాల్, సాతర్లలో 40.2, కొలూర్ తిమ్మనదొడ్డిలో 39.8 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే మధ్యాహ్నం సయమంలో బయటకు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News March 21, 2025

మంత్రి ఫరూక్ సతీమణి మృతికి సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం

image

మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షహనాజ్ మృతికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. షహనాజ్ మృతితో విషాదంలో ఉన్న ఫరూక్ కుటుంబానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సానుభూతిని తెలిపారు. కాగా, కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఉన్న ఆమె ఇవాళ హైదరాబాద్‌లోని వారి నివాసంలో మృతిచెందారు.

News March 21, 2025

76 ఏళ్ల వయసులో తల్లయిన మహిళ

image

ఇథియోపియా దేశంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. మెకెల్లే ప్రాంతానికి చెందిన మెధిన్ హాగోస్ అనే మహిళ 76 ఏళ్ల వయసులో మగబిడ్డకు జన్మనిచ్చారు. తాను సహజ పద్ధతిలోనే గర్భం దాల్చినట్లు ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండగా, ఇంత లేటు వయసులో సహజంగా గర్భం దాల్చడం సాధ్యం కాకపోవచ్చని పలువురు నెటిజన్లు అంటున్నారు. IVF విధానంలో ప్రెగ్నెంట్ అయ్యుంటారని కామెంట్స్ చేస్తున్నారు.

News March 21, 2025

ములుగు: పని పట్ల మంత్రి సీతక్క నిబద్ధత

image

ఎంతో ప‌ని ఒత్తిడి అసెంబ్లీ స‌మావేశాలున్నా శుక్రవారం ఉద‌యం ఎనిమిదిన్న‌ర‌కే ఎర్ర‌మంజిల్‌లోని మిష‌న్ భ‌గీర‌థ కార్యాల‌యానికి మంత్రి సీత‌క్క‌ చేరుకున్నారు. ఉదయం 9.45వర‌కు అధికారుల‌తో జిల్లా అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్, తాగు నీటి పంపిణిపై మంత్రి స‌మీక్ష‌ సమావేశం నిర్వహించారు. అనంత‌రం శాస‌న మండ‌లికి చేరుకుని బ‌డ్జెట‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో మంత్రి సీత‌క్క‌ పాల్గొన్నారు. 

error: Content is protected !!