News March 20, 2025
సూర్యాపేట: త్వరలో ప్రారంభం కానున్న ఇందిరమ్మ ఇళ్లు

సూర్యాపేట జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో 4,140 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడంతో త్వరలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నాలుగు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3,500 మంది చొప్పున లబ్ధిదారులకు మేలు జరగనుంది. జిల్లాలో ఈ పథకానికి 3,09,062మంది దరఖాస్తు చేసుకున్నారు.
Similar News
News March 22, 2025
కక్కిరాలపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

కక్కిరాలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో స్ట్రెంథనింగ్ ఎఫ్ఎల్ఎన్ ఏఐ టూల్స్‌ను నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్ సంబంధించిన అంశాలపై విద్యార్థులు కంప్యూటర్‌ను ఆపరేట్ చేస్తుండగా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధించిన వివిధ తరగతి గదులు, కిచెన్ షెడ్‌ను కలెక్టర్ పరిశీలించారు.
News March 22, 2025
రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జనగామ కలెక్టర్

జనగామ జిల్లాలో లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్న వారు రుసుము చెల్లించి.. రాయితీని పొందుతూ ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు చొరవ చూపుతున్నారని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు రుసుము చెల్లించిన దరఖాస్తు దారులకు 25 శాతం రాయితీనిస్తూ, వెంటవెంటనే భూమి క్రమబద్ధీకరణ చేస్తున్నారన్నారు.
News March 22, 2025
ఫైరింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్న భూపాలపల్లి ఎస్పీ

భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మామునూరు బెటాలియన్ సమీపంలోని ఫైరింగ్ రేంజ్‌లో జిల్లాలోని పోలీసు అధికారులు ఈ ఏడాదికి సంబంధించిన ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సాధనలో ఎస్పీ కిరణ్ ఖరే, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, పిస్టల్‌తో, AK 47, SLR, ఇన్సాస్, వివిధ ఆటోమేటిక్ వెపన్లతో ఫైరింగ్ సాధన చేశారు. పోలీసు అధికారులు తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు.