News March 20, 2025

YCP MLAలు దొంగచాటుగా సంతకాలు పెడుతున్నారు: అయ్యన్న

image

AP: YCP సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్న అసహనం వ్యక్తం చేశారు. ఆ పార్టీ MLAలు దొంగచాటుగా వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నలు అడుగుతున్నారే తప్ప సభకు రావట్లేదన్నారు. దొంగచాటుగా, దొంగల మాదిరి వచ్చి సంతకాలు పెట్టడం ఏంటి? అని నిలదీశారు. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఎన్నికైన సభ్యులు సగర్వంగా సభకు రావాలని సూచించారు.

Similar News

News March 21, 2025

ఎన్నాళ్లకెన్నాళ్లకో ఈ మురిపెం!

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు భారీగా లాభపడ్డాయి. ఈ వారం వరుసగా 5 సెషన్లలోనూ అదరగొట్టాయి. కొన్ని నెలల తర్వాత బెంచ్‌మార్క్ సూచీలు ఒక వారమంతా లాభపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. గత ఏడాది నవంబర్ నాటి పుల్‌బ్యాక్ ర్యాలీలో చివరిసారిగా ఈ ఫీట్ నమోదైంది. NOV 29 నుంచి DEC 5 వరకు సూచీలు వరుసగా ఎగిశాయి. నిఫ్టీ ప్రస్తుత 23,300 స్థాయిలో కన్సాలిడేట్ అయితే మార్కెట్ వర్గాల్లో పాజిటివ్ సెంటిమెంటు మరింత బలపడుతుంది.

News March 21, 2025

‘యానిమల్’ లుక్‌లో ధోనీ.. భారీ రెమ్యునరేషన్!

image

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కిన ఈ-సైకిల్ <<15801433>>యాడ్<<>> భారీ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ యాడ్ కోసం వీరిద్దరూ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ యాడ్ షూట్‌కు ధోనీ రూ.8 కోట్లు తీసుకున్నారని, సందీప్ రూ.5 కోట్లు పొందినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ యాడ్‌పై ఆ సైకిల్ కంపెనీ సీఈవో కునాల్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.

News March 21, 2025

వివేకా హత్య కేసు.. రోజువారీ విచారణ కోరుతూ సునీత పిటిషన్

image

వివేకా హత్య కేసు విచారణపై ఆయన కుమార్తె సునీత TG హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. CBI కోర్టులో రోజూ విచారణ జరిగేలా ఆదేశించాలని కోరారు. ఈ కేసులో సీబీఐని ప్రతివాదిగా చేర్చారు. 15 నెలలుగా విచారణ జరగడం లేదని ఆమె కోర్టుకు వెల్లడించారు. అభియోగ పత్రాల కాపీలను హార్డ్ డిస్క్‌లో సీబీఐ సమర్పించిందని, అయితే అవి ఓపెన్ కావట్లేదంటూ నిందితులు చెబుతున్నారని పేర్కొన్నారు.

error: Content is protected !!