News March 20, 2025
మన్యంకొండ హుండీ ఆదాయం రూ.35.26 లక్షలు

మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత బుధవారం 2వసారి హుండీ లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన సొమ్ము మొత్తం రూ.35,26,085 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ అళహరి మధుసూదన్ కుమార్, అళహరి రామకృష్ణ, ఈవో శ్రీనివాసరాజు, సహాయ కమిషనర్ మదనేశ్వర్, సూపరింటెండెంట్ నిత్యానంద చారి, IDBC మేనేజర్ నీలకంఠ పాల్గొన్నారు.
Similar News
News September 18, 2025
సినీ ముచ్చట్లు!

*పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాలో ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్. పోస్టర్లు రిలీజ్
*నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ‘అఖండ-2’ షూటింగ్ హైదరాబాద్‌లో సాగుతోంది. ఓ పార్టీ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు.
*‘సైయారా’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతోంది. 9.3 మిలియన్ గంటల వ్యూయర్‌షిప్‌తో అత్యధికంగా వీక్షించిన నాన్-ఇంగ్లిష్ ఫిల్మ్‌గా నిలిచింది.
News September 18, 2025
భీమవరం: 5 బార్లను లాటరీ

2025-28 సంవత్సరానికి జనరల్ కేటగిరీలో 5 బార్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్‌లో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. భీమవరంలో 4, నర్సాపురంలో 1 బార్‌కు ఒకే అభ్యర్థి దరఖాస్తు చేసుకోవడంతో వారిని ఏకగ్రీవంగా ఎంపిక చేసి బార్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారి ప్రభు కుమార్ పాల్గొన్నారు.
News September 18, 2025
HYDలో స్పీడ్ ఇంతే.. పెద్దగా ఏం మారలే..!

మహానగరంలో రోడ్లపై వాహనాల వేగం రోజురోజుకూ తగ్గిపోతోంది. కారణం ట్రాఫిక్ జామ్. రోజు రోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్య నగర రోడ్ల విస్తీర్ణం సరిపోవడం లేదు. ప్రస్తుతం సిటీలో సొంత వాహనాలే 90 లక్షలకు చేరుకున్నాయి. ఇక బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు అదనం. 2024లో సిటీలో సగటు స్పీడ్ 18KMPH ఉంటే ప్రస్తుతం 24 KMPHకు పెరిగింది. ఇక అర్థం చేసుకోండి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో.