News March 20, 2025

రాజ్‌భవన్ రోడ్డులోని ATMలో పాడు పని!

image

ATMలో ఓ వ్యక్తి చేసిన పాడు పని ఆలస్యంగా వెలుగుచూసింది. పంజాగుట్ట PS పరిధి రాజ్‌భవన్‌ రోడ్డు RBL ATM పనిచేయడం లేదని సిబ్బంది తనిఖీ చేశారు. సెన్సార్ పనిచేయడం లేదని గుర్తించి, సీసీ టీవీ పరిశీలించగా కంగుతిన్నారు. ఈ నెల 10వ తేదీన రాత్రి ఓ యువకుడు డబ్బులు డ్రా చేశాడు. అనంతరం ATM మిషన్ పక్కనే మూత్రవిసర్జన చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 18, 2025

HYD: నల్లాబిల్లు కట్టాలని క్రెడిట్‌కార్డు ఖాళీ చేశాడు!

image

సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో డబ్బు కాజేస్తున్నారు. పెండింగ్ నల్లా బిల్లు చెల్లించాలని ఆన్‌లైన్ లింక్ పంపి ఓ వ్యక్తి నుంచి రూ.95,237 కాజేశారు. ఎల్బీనగర్ మన్సూరాబాద్ శ్రీరామ్ నగర్ కాలనీవాసి సంకలమద్ది శ్రీనివాస్ రెడ్డికి SEPT 11న వాటర్ బోర్డుకు బిల్లు చెల్లించాలని 6303323494 నుంచి వాట్సప్ లింక్ పంపాడు. ఈనెల బిల్ చెల్లించలేదని, నిజమేనని నమ్మి APK ఫైల్‌ ఇన్‌స్టాల్ చేయగా క్రెడిట్ కార్డు కాళీ అయింది.

News September 18, 2025

HYD: దుర్గామాత మండపాలకు అనుమతి తప్పనిసరి

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నిర్వాహకులు మండపాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వెబ్‌సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో నమోదు చేయాలన్నారు.

News September 18, 2025

HYD: వైద్య సేవల బలోపేతంపై మంత్రి సమీక్ష

image

ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రులలో వైద్య సేవల బలోపేతంపై మంత్రి దామోదర రాజనరసింహ ఎస్ఆర్ నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని పాత భవనాల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో పర్యటించి 2, 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని TGMSIDC ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.