News March 20, 2025
ఈ సినిమాలోనూ ‘గజిని’ లాంటి సర్‌ప్రైజ్: మురుగదాస్

గజిని చిత్రంలో మాదిరే ‘సికందర్’ సినిమాలోనూ సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందని దర్శకుడు మురుగదాస్ చెప్పారు. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయని పేర్కొన్నారు. కాగా సల్మాన్‌కు హత్యా బెదిరింపుల నేపథ్యంలో షూటింగ్ సమయంలో అందరినీ చెక్ చేసేందుకు 2-3 గంటల సమయం పట్టేదని పేర్కొన్నారు. కాగా ఈ మూవీ ఈ నెల 30న రిలీజ్ కానుంది.
Similar News
News March 21, 2025
వివేకా హత్య కేసు.. రోజువారీ విచారణ కోరుతూ సునీత పిటిషన్

వివేకా హత్య కేసు విచారణపై ఆయన కుమార్తె సునీత TG హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. CBI కోర్టులో రోజూ విచారణ జరిగేలా ఆదేశించాలని కోరారు. ఈ కేసులో సీబీఐని ప్రతివాదిగా చేర్చారు. 15 నెలలుగా విచారణ జరగడం లేదని ఆమె కోర్టుకు వెల్లడించారు. అభియోగ పత్రాల కాపీలను హార్డ్ డిస్క్‌లో సీబీఐ సమర్పించిందని, అయితే అవి ఓపెన్ కావట్లేదంటూ నిందితులు చెబుతున్నారని పేర్కొన్నారు.
News March 21, 2025
కశ్మీర్‌లో ఆ రోజులు పోయాయి: అమిత్ షా

కశ్మీర్‌లో ఉగ్రదాడులు తగ్గిపోయి, పరిస్థితులు మారిపోయాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆ రాష్ట్రంలోని సినిమా హాళ్లన్నీ నిండిపోతున్నాయని చెప్పారు. ‘యువకులు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఉగ్రవాదులకు సానుభూతిగా ఎలాంటి ఆందోళనలు చేయడం లేదు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కశ్మీర్‌ను నాశనం చేశాయి. మేం కశ్మీర్‌ను విజయవంతంగా భారత్‌లో విలీనం చేశాం’ అని పేర్కొన్నారు.
News March 21, 2025
GST: 12% శ్లాబ్‌రేట్ రద్దుకోసం రంగంలోకి నిర్మల

GSTలో 12% శ్లాబ్‌రేటు ఎత్తివేతపై ఏర్పాటైన ఆరుగురు సభ్యుల మంత్రుల బృందంతో FM నిర్మలా సీతారామన్ సమావేశం అవుతారని తెలిసింది. పన్ను వ్యవస్థను సింప్లిఫై చేసేందుకు ఈ శ్లాబును రద్దు చేయాలని ప్రయత్నిస్తున్న కేంద్రం GoMను నియమించింది. వీరిలో కొందరు దీనికి మద్దతు ఇస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఏకగ్రీవ నిర్ణయం కోసం నిర్మల వీరితో చర్చించనున్నారు. 12% శ్లాబ్ ద్వారా GOVTకి 5% ఆదాయమే వస్తోంది.