News March 20, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. నెల తర్వాత 23K చేరిన నిఫ్టీ

అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నెల తర్వాత నిఫ్టీ 23వేల మార్కును అందుకుంది. అటు సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడి 75,889 వద్ద చలిస్తోంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాలు లాభాల బాట పట్టాయి.
Similar News
News February 18, 2026
ఆయుష్ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

న్యూఢిల్లీలోని <
News February 18, 2026
ఫాల్గుణ మాసంలో ఇలా చేయండి: పండితులు

మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణం. ఈ నెలలో లక్ష్మీనారాయణులను భక్తితో కొలిస్తే శుభాలు కలుగుతాయని పండితుల మాట. ‘చంద్రుడు ఫల్గుణి నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరొచ్చింది. అర్జునుడికి ‘ఫల్గుణుడు’ అనే పేరుండటం మరో ప్రత్యేకత. దానధర్మాలు చేయడం, పవిత్ర నదులలో స్నానమాచరించడం వల్ల పుణ్యం లభిస్తుంది. ప్రకృతి వసంతానికి సిద్ధమయ్యే ఈ కాలంలో ఆధ్యాత్మిక చింతనతో గడపడం ఉత్తమం’ అంటున్నారు.
News February 18, 2026
మిరప మొక్కల వేర్లపై బొడిపెలకు కారణమేంటి?

మిరప పంటకు నులి పురుగులు ఆశించడం వల్ల మొక్కల వేర్లపై బొడిపెలు ఏర్పడతాయి. దీని వల్ల పంటకు నష్టం వాటిల్లుతుంది. ఈ నులి పురుగుల నివారణకు ఎకరాకు 100 కిలోల వేప పిండిని చల్లి, మట్టిలో కలిసే విధంగా నీరు పెట్టాలి. ఈ పురుగులు ఆశించిన పొలంలో వంగ, టమాటా, బంగాళాదుంపలను సాగు చేయకూడదు. ఆవాలు, నువ్వులు, మొక్కజొన్న, చిరుధాన్యాలతో పంట మార్పిడి చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


