News March 20, 2025
ఎస్సారెస్పీ స్టేజ్-2కు రూ.34.01 కోట్లు కేటాయింపు

సూర్యాపేట జిల్లాలోని SRSP స్టేజ్-2 కింద కొనసాగుతున్న పనులకు రూ.34.01 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. తూములు, షట్టర్లు, లైనింగ్ కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదు. జిల్లాలో వందకు పైగా కిలోమీటర్ల మేరకు ఉన్న ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు లైనింగ్ లేకపోవడంతో నీటిని విడుదల సమయంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మూసీ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలకు రూ.50కోట్లు కేటాయించడంతో చివరి ఆయకట్టుకు సైతం నీరందనుంది.
Similar News
News November 8, 2025
కృష్ణా: ‘బెదిరించి రూ.14 లక్షలు దోచేశారు’

59 ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసి తన నంబర్‌పై కేసు నమోదైందని బెదిరించి రూ. 14 లక్షలు దోచుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు విశాఖ CPని ఆశ్రయించారు. కేసు విచారణలో నిందితులు కృష్ణా జిల్లా పెడనకి చెందిన తారకేశ్వర్రావు, శివకృష్ణ, నాగరాజు, చందు, అబ్దుల్ కరీంగా గుర్తించారు. వీరు 350 నకిలీ సిమ్స్ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు.
News November 8, 2025
రాత్రి బెడ్‌షీట్ కప్పి ఫోన్ స్క్రోల్ చేస్తున్నారా?

ఈమధ్య యువత పగలు రాత్రి తేడా లేకుండా ఫోన్‌లో రీల్స్ ఫ్లిప్ చేస్తూనే జీవితం గడుపుతోంది. చీకట్లో కళ్లకు దగ్గరగా పెట్టుకుని ఫోన్ చూస్తే నరాలు, మెదడుపై తీవ్ర ఒత్తిడి పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పైగా లైట్స్ ఆఫ్ చేశాక, బెడ్ షీట్ కప్పుకుని స్క్రీన్‌కు అతుక్కుపోయారంటే మన కళ్లపై బ్లూ లైట్ నేరుగా పడుతుంది. దీంతో నిద్రలేమి, కంటి చూపు సమస్యలు వస్తాయి. ఫోన్ వాడండి. వ్యసనంగా మార్చుకోకండి.
Share It
News November 8, 2025
ఇడుపులపాడు చెరువులో 16 ఏళ్ల యువకుడు గల్లంతు

ఇంకొల్లు మండలం ఇడుపులపాడులోని చెరువులో 16 ఏళ్ల యువకుడు ఈతకు వెళ్లి గల్లంతైన ఘటన శనివారం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉదయం 10 గంటల సమయంలో స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లిన అతను బయటకు రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అగ్నిమాపక సిబ్బంది బోటు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడినప్పటికీ లైట్లు వేసి గాలిస్తున్నారు.


