News March 20, 2025
వారం రోజుల్లో రూ.2300 పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వారం రోజుల్లోనే రూ.2300 పెరిగి శుభకార్యాల వేళ సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.200 పెరిగి రూ.83,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 పెరగడంతో రూ.90,660కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 పెరిగి ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,14,100గా ఉంది.
Similar News
News March 21, 2025
CUET UG దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) <
News March 21, 2025
పచ్చళ్లు అతిగా తింటే క్యాన్సర్ రావొచ్చు!

అతిగా పచ్చళ్లు తినడం ప్రమాదకరమని ప్రముఖ వైద్యుడు శ్రీకాంత్ పేర్కొన్నారు. ‘పచ్చళ్ళలో పెరిగే శిలీంధ్రాలు (బూజు/ఫంగస్) నైట్రేట్లని నైట్రైట్లుగా మారుస్తాయి. ఇవి క్యాన్సర్ కారకాలు. అప్పుడప్పుడూ తిన్నవారిని ఇవేం చేయలేవు. కానీ, అదేపనిగా తింటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ ఇది ప్రమాదకరమే. నిలువ పచ్చళ్ల కంటే అప్పుడే చేసిన రోటి పచ్చళ్లు సేఫ్’ అని తెలిపారు.
News March 21, 2025
రెండేళ్ల తర్వాత రూపాయికి బెస్ట్ వీక్ ఇదే

భారత రూపాయి అదరగొట్టింది. డాలర్‌తో పోలిస్తే ఈ రెండేళ్లలో ఈ వారమే అత్యధికంగా ఎగిసింది. 1.2 శాతానికి పైగా బలపడింది. నేడు ఏకంగా 39 పైసలు బలపడి 85.97 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ పతనమవ్వడం, ఫారెక్స్ మార్కెట్లో జోక్యంతో పాటు లిక్విడిటీకి RBI మద్దతివ్వడం, ఫారిన్ ఇన్వెస్టర్లు తిరిగి పెట్టుబడులు పెడుతుండటం, ట్రేడ్ డెఫిసిట్ తగ్గడం, మొత్తం సర్‌ప్లస్ $4.5 బిలియన్లకు చేరడమే ఇందుకు కారణాలు.