News March 20, 2025
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. టాప్ సెలబ్రిటీలపై కేసు

TG: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, ప్రణీత, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్లతో పాటు 18 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది. వీరిలో శ్రీముఖి, సిరి, వర్షిణి, వాసంతి, శోభా శెట్టి, అమృత, పావని, నేహ, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రఘు, సుప్రీత ఉన్నారు.
Similar News
News March 21, 2025
రేపు కర్ణాటక బంద్.. విద్యార్థుల్లో ఆందోళన

గత నెలలో బెళగావిలో RTC బస్సు కండక్టర్‌పై మరాఠీ అనుకూలవాదులు చేసిన దాడికి నిరసనగా కర్ణాటకలో కన్నడ సంఘాలు రేపు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 వరకు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సేవలు నిలిచిపోనున్నాయి. ఓవైపు పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో తమ పరిస్థితేంటంటూ విద్యార్థుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. కర్ణాటక వెళ్లే తెలుగురాష్ట్రాలవారు ప్రయాణం వాయిదా వేసుకోవడమే మంచిది.
News March 21, 2025
చెన్నైలో రోడ్డుకు రవిచంద్రన్ అశ్విన్ పేరు?

మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరును చెన్నైలో ఓ రోడ్డుకు పెట్టే అవకాశం ఉంది. అశ్విన్ స్వగృహం ఉన్న వెస్ట్ మాంబళంలోని రామకృష్ణాపురం ఫస్ట్ స్ట్రీట్‌కు తన పేరును పెట్టే ప్రతిపాదనను ఆయన సంస్థ ‘క్యారమ్ బాల్ ఈవెంట్ అండ్ మార్కెటింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్’ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌కు సమర్పించింది. కాగా.. ఈ ఏడాది IPLలో CSKకు ఆడనున్న అశ్విన్, సీజన్ ముగిశాక IPL నుంచి రిటైరవ్వొచ్చని సమాచారం.
News March 21, 2025
ఉగాది రోజున ‘స్పిరిట్’ స్టార్ట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోయే ‘స్పిరిట్’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఉగాది రోజున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే, రెగ్యులర్ షూటింగ్‌కు కాస్త టైమ్ పట్టే అవకాశం ఉంది.