News March 20, 2025
GNT: బంగారం చోరీ.. పట్టించిన తండ్రి

జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్న యువకుడిని అతని తండ్రే పట్టాభిపురం పోలీసులకు అప్పగించాడు. కాకినాడకు చెందిన యువకుడు గుంటూరు విద్యానగర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో ఈ నెల 7న రూ. కోటి విలువ చేసే బంగారాన్ని చోరీచేశాడు. పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో భయపడి చోరీ బంగారాన్ని పార్సిల్ ద్వారా పంపించాడు. ఆ తర్వాత తండ్రి ఆ నిందితుణ్ణి స్టేషన్‌లో అప్పగించినట్లు తెలుస్తోంది.
Similar News
News December 28, 2025
ఫైరింగ్ ప్రాక్టీస్‌లో ప్రకాశం జిల్లా పోలీసులు.!

ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని ఫైరింగ్ రేంజ్ వద్ద ఆదివారం వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్‌ను SP హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. అలాగే ఎస్పీ హర్షవర్ధన్ రాజు సైతం ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి అధికారుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఫైరింగ్ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఏకాగ్రతతో ఉండాలన్నారు.
News December 28, 2025
లక్ష్మీ కటాక్షం కోసం ఇంట్లో ఉంచాల్సిన వస్తువులివే..

లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, శ్రీఫలం, తామర గింజలు, గురువింద గింజలు వంటి వస్తువులు లక్ష్మీ కటాక్షాన్ని ఆకర్షిస్తాయని పండితులు చెబుతున్నారు. వీటితో పాటు ముత్యాలు, రూపాయి కాసులు, చిట్టి గాజులు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనవని అంటున్నారు. ఈ మంగళకరమైన వస్తువులను పూజ గదిలో ఉంచి భక్తితో ఆరాధించడం వల్ల ప్రతికూల శక్తి తొలగి, ఇంట్లో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూచిస్తున్నారు.
News December 28, 2025
మీకోసం కాల్ సెంటర్‌ను వినియోగించుకోవాలి: కలెక్టర్

నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం ‘మీకోసం’ కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అర్జీదారులు నేరుగా కలెక్టరేట్‌కు రావడంతో పాటు Meekosam.ap.gov.in ద్వారా లేదా 1100 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.


