News March 20, 2025
సెంటర్స్ వద్ద 163 BNSS యాక్ట్ అమలు: SP నరసింహ

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద మార్చి 21 నుంచి ఏప్రియల్ 4 వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్-2023 అమలులో ఉంటుందని ఎస్పీ నరసింహ తెలిపారు. 67 పరీక్షా కేంద్రాలలో 11,912 విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని సూచించారు. అదేవిధంగా జిరాక్స్ సెంటర్లు మూసి వేయాలన్నారు.
Similar News
News November 7, 2025
పిల్లల విక్రయం? పెళ్లి కాకుండానే మహిళ ప్రసవాలు!

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామానికి చెందిన ఓ అవివాహిత గురువారం ఇంట్లో బిడ్డకు జన్మనిచ్చారు. శిశువుకు హెల్త్ బాగాలేకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గతంలోనూ ఆమెకు రెండు ప్రసవాలు జరిగినట్లు గుర్తించిన సిబ్బంది కంగుతిన్నారు. బిడ్డలను కని, విక్రయించడమే వారి వ్యాపారమని స్థానికులు చెబుతున్నారు. వైద్య సిబ్బంది శిశువును నంద్యాలలోని కేర్ సెంటర్‌కు తరలించారు.
News November 7, 2025
40 తర్వాత ఆహారంలో ఇవి చేర్చుకోండి

వయస్సు మీద పడుతున్న కొద్దీ కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. 40 ఏళ్లకు పైబడిన తరువాత జంక్ ఫుడ్‌కు పూర్తిగా స్వస్తి చెప్పి ఆహారంలో టమాటాలు, చిలగడదుంపలు, కోడిగుడ్లు, పుట్ట గొడుగులు, యాపిల్ పండ్లు, బాదం తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో అజీర్తి, గ్యాస్, మలబద్దకం తగ్గుతాయి. కొలెస్ట్రాల్, బీపీ నియంత్రణలో ఉండి గుండెజబ్బులు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.
News November 7, 2025
పనులు ఆపేస్తాం.. ప్రభుత్వానికి బిల్డర్ల అల్టిమేటం

TG: రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.36వేల కోట్ల బిల్లులను ఈ నెలాఖరులోగా చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. లేదంటే డిసెంబర్ 1 నుంచి అన్ని శాఖల పరిధిలో సివిల్ వర్క్స్ నిలిపివేస్తామని స్పష్టం చేసింది. కాంట్రాక్టర్లు ఆస్తులను తాకట్టు పెట్టి పనులు చేశారని, వారి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేసింది.


