News March 20, 2025

తూ.గో జిల్లా ఫిలిం డిస్ట్రిబ్యూటర్ మృతి

image

తూర్పు గోదావరి జిల్లా ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న అమలాపురం వాసి ఆకుల రాము(62) గురువారం ఉదయం ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు. సినిమా పంపిణీ రంగంలో కోనసీమ ప్రాంతంలో ఏ సినిమా కొనాలన్నా రాముని సంప్రదించిన తరువాతే కొనేవారు. సినిమా రంగానికి ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. ఆయన మరణంతో కోనసీమ సినిమా రంగానికి తీరనిలోటని సినీనటుడు రమణ లాల్ అన్నారు.

Similar News

News November 8, 2025

దుగ్గిరాల: అప్పు ఇప్పించలేదని అంతమొందించారు..!

image

అప్పు ఇప్పించలేదన్న కోపంతో దుగ్గిరాల యాదవపాలెంలో నీలాపు వీరబాబు (37)ను దారుణంగా హత్య చేశారు. చికెన్ వ్యాపారి నవీన్, వీరబాబు మధ్య డబ్బు విషయమై గొడవ జరిగింది. మనసులో పెట్టుకున్న నవీన్, బంధువు కృష్ణతో కలిసి శుక్రవారం సాయంత్రం వీరబాబు తల్లి కళ్లముందే కత్తితో గొంతు కోయించాడు. ఈ ఘటనపై ఎస్ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 8, 2025

విశాఖపై దక్షిణాఫ్రికా క్రికెట్ కామెంటేటర్ భావోద్వేగ ట్వీట్

image

దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత కాస్ నాయుడు (Kass Naidoo) విశాఖతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. #CWC25 సందర్భంగా విశాఖ వచ్చిన ఆమె భావోద్వేగంగా స్పందించారు. తన తాత అనకాపల్లిలో పుట్టారని.. 57 ఏళ్ల క్రితం తన అమ్మ కూడా విశాఖలోనే ఉండేవారని గుర్తు చేసుకున్నారు. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను క్రీడా రంగంలోని ఉత్తములతో కలిసి వ్యాఖ్యానం చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ ట్వీట్ చేశారు.

News November 8, 2025

దేశంలోనే మొదటి పురోహితురాలు

image

సాధారణంగా పెళ్లిళ్లు, అన్నప్రాశనలు, పూజలు వంటివన్నీ పురుషులే చేస్తుంటారు. కానీ కలకత్తాకి చెందిన నందిని భౌమిక్ పదేళ్లుగా పురోహితురాలిగా వ్యవహరిస్తోంది. నందిని రెండో కూతురి వివాహానికి పురోహితుడు ఎవరూ దొరక్కపోవడంతో ఆమే పురోహితురాలిగా మారారు. ఈ నిర్ణయాన్ని పురుషుల కంటే మహిళలే ఎక్కువగా వ్యతిరేకించారంటున్నారు నందిని. ఎప్పటికైనా ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలనేదే తన ఉద్దేశం అని చెబుతున్నారామె.