News March 20, 2025
తిరుపతిలో యువకుడు దారుణ హత్య

తిరుపతి గ్రామీణ మండలం వేదాంతపురం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన విషయాన్ని పోలీసులు గుర్తించారు. దాదాపు 30 సంవత్సరాల వయసు కలిగిన యువకుడిని రెండు మూడు రోజుల క్రితం హత్య చేశారు. మృతుడు మొఖం గుర్తుపట్టలేని విధంగా మారింది. మృతుడు వద్ద ఇటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని తిరుచానూరు పోలీసులు, క్లూస్ టీం బృందం పరిశీలించింది.
Similar News
News January 9, 2026
చిత్తూరు : రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు శనివారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ఇస్తున్నట్లు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. పాఠశాల పని దినాలు సర్దుబాటులో భాగంగా 10న రెండో శనివారం పాఠశాలలు పనిచేయాల్సి ఉన్నా, సెలవు దినంగా ప్రకటించామన్నారు. ఈ దినాన్ని మరో రోజున పనిదినంగా పరిగణించాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా, టెన్త్ విద్యార్థులకు వంద రోజుల ప్రత్యేక తరగతులకు సైతం బ్రేక్ ఇచ్చారు.
News January 9, 2026
కొల్లాజెన్ ఎక్కువగా దొరికే ఆహారాలు

మన చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, జుట్టు మృదువుగా, ఉండాలన్నా కొల్లాజెన్ కీలకం. కొల్లాజెన్ కోసం సాల్మన్, ట్యూనా, సార్డినెస్ చేపలు, సిట్రస్ పండ్లు, బెర్రీలు, గుడ్లు, పాలకూర, కాలే, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో కొల్లాజెన్ దొరుకుతుంది. ధూమపానం, ఎండలో గడపడం, అధిక చక్కెరలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక ఒత్తిడి స్థాయులు కూడా శరీరంలో కొలాజెన్ క్షీణతకు కారణమవుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
News January 9, 2026
విశాఖ జిల్లాలోకి గంజాయి తెస్తున్న మహిళలు

పాత గాజువాకలో అర్ధరాత్రి వేళ గంజాయి తరలిస్తున్న ముగ్గురు మహిళలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి పాతగాజువాక జంక్షన్ 38 బస్ స్టాప్ వద్ద ఏజెన్సీ నుంచి విశాఖకు 40 కేజీలు గంజాయి తీసుకువచ్చి దించుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గాజువాక పోలీసులకు వారిని అప్పగించారు


