News March 24, 2024
భర్తను హత్యచేయించిన భార్య
తిప్పర్తి మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లిలో ఈ నెల 17న జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు చేధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడు కిరాయి వ్యక్తులతో భార్య ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. భార్య, ఐదుగురు నిందితులను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 2బైకులు, కారు, పుస్తెలతాడు,5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News January 3, 2025
NLG: సంక్రాంతికి ఆర్టీసీ 400 ప్రత్యేక బస్సులు
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ఎక్కువ సంఖ్యలో సొంత ఊళ్లకు చేరుకునేందుకు అవకాశముందని భావించిన ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు.
News January 3, 2025
NLG: జిల్లాలో మళ్లీ పెరిగిన చలి
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. అల్పపీడన ప్రభావంతో గడిచిన పది రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురు, శుక్రవారాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో పల్లెలతో పాటు పట్టణాల్లో చిన్నారులు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
News January 3, 2025
నల్లగొండ: గ్రామీణ మహిళలకు ఉచిత శిక్షణ
నల్లగొండ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలకు మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీలో 30 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ డైరెక్టర్ ఈ. రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తామని, 18 సం. నుంచి 45 లోపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారు అర్హులని, ఆసక్తి గల వారు జనవరి 6 లోపు సంస్థ ఆఫీసులో, పూర్తి వివరాలకు 7032415062 నంబర్ సంప్రదించాలన్నారు.