News March 20, 2025
ADB: ఈసారైనా స్టేట్‌లో సింగిల్ డిజిట్ వచ్చేనా..!?

పదో తరగతి పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ, శ్రద్ధ వహించారు. గత 2023 సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 92.93 శాతంతో ఆదిలాబాద్ 17వ స్థానంలో నిలవగా 2022లో 19వ స్థానంలో నిలిచింది. ఈసారి వంద శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవడానికి చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ప్రత్యేక ప్రణాళిక చేపట్టి వెనుకబడిన విద్యార్థులపై ఫోకస్ చేశారు.
Similar News
News March 21, 2025
గుడిహత్నూర్‌లో క్లినిక్ సీజ్

గుడిహత్నూర్‌లోని ఓ క్లినిక్‌ను అధికారులు సీజ్ చేశారు. సూర్యవంశీ అనే RMP వైద్యుడు తన పరిధికి మించి ఓ గర్భం దాల్చిన బాలికకు అబార్షన్ పిల్స్ ఇచ్చారు. విషయం తెలుసుకున్న DMHO డా.నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు అధికారులు సదరు క్లినిక్‌ను సీజ్ చేశారు. జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్న RMPలు కేవలం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని, పరిధికి మించి వైద్యం అందిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 21, 2025
పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఆదిలాబాద్ కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట శిక్షణ కలెక్టర్ అభిగ్యాన్, డీఈఓ ప్రణీత తదితరులు ఉన్నారు.
News March 21, 2025
ADB: ACB కేసులో తప్పుడు సాక్ష్యం.. ముగ్గురిపై కేసు

కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పిన ముగ్గురి పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ ACB స్పెషల్ కోర్టు జడ్జీ తీర్పునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 2010లో లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) రేగుంట స్వామి కేసులో ఇచ్చోడ మండలానికి చెందిన కన్నమయ్య, నారాయణ, మల్లయ్య తప్పుడు సాక్ష్యం చెప్పారు. దీంతో వారిపై క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది.