News March 20, 2025
ఉమ్మడి కరీంనగర్: బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్రంలోని బీసీ గురుకుల పాఠశాలల్లో 2025-2026 ఏడాదికి 6,7,8,9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. http://www.mjptbcadmissions.org లో ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి. సైదులు తెలిపారు. ఎప్రిల్ 24న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మొత్తం 6,832 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తామన్నారు.
Similar News
News March 21, 2025
జనగామ జిల్లా అభివృద్ధికి బ్యాంకులు తోడ్పాటు నందించాలి: కలెక్టర్

ప్రాధాన్యత కలిగిన రంగాలకు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి బ్యాంకులు తోడ్పాటునందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం బ్యాంకర్లతో(డీసీసీ/డీఎల్ఆర్సీ) జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ రుణాలపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
News March 21, 2025
సహోద్యోగినిపై కామెంట్స్ చేయడం లైంగిక హింస కాదు: హైకోర్టు

సహోద్యోగినిపై కామెంట్స్ చేయడం, పాటలు పాడటం లైంగిక హింస కిందకు రాదని బాంబే హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. తన జుట్టు గురించి ఓ సహోద్యోగి కామెంట్స్ చేస్తూ పాటలు పాడారని.. మహిళల ఎదుట పురుషుల మర్మావయాల గురించి మాట్లాడారని పుణేలోని HDFC బ్యాంకు ఉద్యోగిని తన సహోద్యోగిపై ఫిర్యాదు చేశారు. అతడిని బ్యాంకు డిమోట్ చేయగా ఆయన పారిశ్రామిక కోర్టుకెళ్లారు. అక్కడ చుక్కెదురవ్వడంతో బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
News March 21, 2025
మంచిర్యాల: పరీక్షల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు సస్పెండ్

మంచిర్యాల జిల్లా విద్యాశాఖలో ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారు. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నాపత్రాలు తరలింపులో నిర్లక్ష్యం వహించిన చీఫ్ సూపరింటెండెంట్ సర్దార్ అలీ ఖాన్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ పద్మజను జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.