News March 20, 2025
గద్వాల: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలో 44వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. హైవేపై ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. దీంతో కారు డ్రైవర్ ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఉండవెల్లి ఎస్ఐ మహేశ్ ఘటనా స్థలానికి పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 10, 2025
జడ్చర్ల: సైబర్ వల.. యువకుడు విలవిల

సైబర్ నేరగాళ్లు కొత్త తరహ మోసాలకు తెర తీస్తున్నారు. జడ్చర్లకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఏకంగా రూ.3.50 లక్షలు పోగొట్టుకున్నాడు. జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ గర్భవతిని చేస్తే రూ.15 లక్షలు ఇస్తానని యువకుడిని నమ్మించింది. దీనికి అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పింది. అకౌంట్‌లో రూ.3.50 లక్షలు వేసుకోగా ఫోన్‌కు లింక్ క్లిక్ చేయగా డబ్బు మాయమైంది. ఆమెకు కాల్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. పోలీసులను ఆశ్రయించాడు.
News November 10, 2025
పెద్దపల్లి: ‘35 ఏళ్ల పాటు దిగుబడి ఇస్తుంది’

వరిపంటలో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు పామ్ ఆయిల్ పంట లాభదాయకమని పెద్దపల్లి వ్యవసాయ శాఖ సూచించింది. తక్కువ శ్రమతో, అధిక లాభాలను అందించే ఈ పంట 35ఏళ్లపాటు దిగుబడి ఇస్తుందని అధికారులు తెలిపారు. ‘టన్నుకి రూ.19,000- 21,000 వరకు ధర లభిస్తోంది. మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్‌పై ప్రభుత్వం 90% సబ్సిడీ ఇస్తుంది. రైతులు ఈ యాసంగి సీజన్‌లో పామ్ ఆయిల్ సాగు ప్రారంభించి, ఆర్థికంగా బలపడాలి’ అని అధికారులు పిలుపునిచ్చారు.
News November 10, 2025
IVF ప్రక్రియలో దశలివే..

IVFలో 5 కీలకమైన దశలు ఉంటాయి. ఎగ్ స్టిమ్యులేషన్‌కు హార్మోన్ల ఇంజెక్షన్ చేసినప్పటి నుంచి బ్లడ్ టెస్ట్ చేయడానికి 9-14 రోజులు పడుతుంది. తర్వాత పిండాన్ని బదిలీ చేస్తారు. యావరేజ్‌గా IVF సైకిల్ కోసం 17-20 రోజుల సమయం పడుతుంది. అయితే పేషెంట్ కండీషన్ బట్టి.. సమయం మారుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా సంతానం పొందాలనుకునేవారు ప్రోటీన్లు, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి.


