News March 20, 2025
భారీ ఎన్‌కౌంటర్.. 22మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్- దంతెవాడ సరిహద్దుల్లోని అండ్రీ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 22 మంది మావోలు మరణించారు. ఎదురుకాల్పుల్లో ఒక జవాను చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదిలో పలుమార్లు జరిగిన ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.
Similar News
News March 21, 2025
ఉగాది రోజున ‘స్పిరిట్’ స్టార్ట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోయే ‘స్పిరిట్’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఉగాది రోజున ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే, రెగ్యులర్ షూటింగ్‌కు కాస్త టైమ్ పట్టే అవకాశం ఉంది.
News March 21, 2025
రాష్ట్రంలో భానుడి భగభగలు

AP: రాష్ట్రంలో ఇవాళ ఎండలు మండిపోయాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రిలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA తెలిపింది. కర్నూలు జిల్లా కోసిగిలో 40.6, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.2, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట, అన్నమయ్య జిల్లా గాదెలలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. మరోవైపు రేపు 18 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది.
News March 21, 2025
సహోద్యోగినిపై కామెంట్స్ చేయడం లైంగిక హింస కాదు: హైకోర్టు

సహోద్యోగినిపై కామెంట్స్ చేయడం, పాటలు పాడటం లైంగిక హింస కిందకు రాదని బాంబే హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. తన జుట్టు గురించి ఓ సహోద్యోగి కామెంట్స్ చేస్తూ పాటలు పాడారని.. మహిళల ఎదుట పురుషుల మర్మావయాల గురించి మాట్లాడారని పుణేలోని HDFC బ్యాంకు ఉద్యోగిని తన సహోద్యోగిపై ఫిర్యాదు చేశారు. అతడిని బ్యాంకు డిమోట్ చేయగా ఆయన పారిశ్రామిక కోర్టుకెళ్లారు. అక్కడ చుక్కెదురవ్వడంతో బాంబే హైకోర్టును ఆశ్రయించారు.