News March 20, 2025

HNK: రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జై వ్యక్తి మృతి

image

మామునూరు పోలీసు స్టేషన్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి రోడ్డుపై నుజ్జునుజ్జై అయ్యి చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ లైన్స్ టీ షర్ట్, నల్లటి ప్యాంట్, చెప్పులు ధరించి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆక్సిడెంట్ ఎలా జరిగిందని ఎంక్వైరీ చేస్తున్నట్టు స్టేషన్ ఎస్ఐ కృష్ణవేణి పేర్కొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News July 7, 2025

చేప పిల్లలు వద్దు.. నగదు ఇవ్వండి: మత్స్యకారులు

image

TG: ప్రభుత్వం ఏటా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. వాటిని కాంట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేయడం వద్దని, నేరుగా సహకార సంఘాలకు నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. నగదు ఇస్తే తామే నాణ్యమైన చేప పిల్లలను కొనుగోలు చేసుకుంటామన్నారు. కాంట్రాక్టర్లు సైజ్, నాణ్యతలో నిబంధనలు పాటించట్లేదని ఆరోపిస్తున్నారు. INC నేత జీవన్ రెడ్డి సైతం నగదు అంశంపై మంత్రి శ్రీహరికి లేఖ రాశారు.

News July 7, 2025

జూబ్లీహిల్స్‌ కోసం దండయాత్ర!

image

జూబ్లీహిల్స్‌ కోసం రాజకీయ పార్టీలే కాదు ఉద్యమకారులు దండయాత్రకు సిద్ధమయ్యారు. తమకు న్యాయం చేయకపోతే ఉప ఎన్నికలో పోటీ చేస్తామని INCని హెచ్చరించారు. ఓ వైపు TDP వ్యూహం రచిస్తోంది. తాను పోటీలో ఉంటానని యుగ తులసి పార్టీ అధ్యక్షుడు శివకుమార్ ప్రకటించారు. ఇక ఇండిపెండెంట్లు ఎంతమంది వస్తారో తెలియని పరిస్థితి. ప్రధాన పార్టీలైన INC, BRS, BJP గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి నెలకొంది.