News March 24, 2024

ఈతకు వెళ్లి పదవ తరగతి విద్యార్థి మృతి

image

పదవ తరగతి పరీక్షలు రాస్తున్న పాత సూరారం గ్రామానికి చెందిన జక్కుల సంపత్ అనే విద్యార్థి ఆదివారం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు.

Similar News

News January 2, 2025

ఖమ్మం జిల్లాలో రేపు ఎంపీ పర్యటన

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటించనున్నట్లు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సుజాతనగర్, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. తదనంతరం ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించే మున్నేరు కరకట్ట నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారని పేర్కొన్నారు. తదనంతరం ఖమ్మం రూరల్ మండలంలో పర్యటిస్తారన్నారు.

News January 2, 2025

వరాహ అవతారంలో భద్రాద్రి రామయ్య

image

దక్షిణాది అయోధ్య భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా మూడో రోజు గురువారం వరాహ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మహానివేదన అనంతరం స్వామివారికి తిరువీధి సేవ నిర్వహిస్తారు. నృత్యాలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో విహరిస్తారు. ఈ కార్యక్రమంలో ఈవో రమాదేవి, ఆలయ అధికారులు,భక్తులు పాల్గొన్నారు.

News January 2, 2025

కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ సర్వే కోసం డిపాజిట్ చెల్లించండి: కేంద్ర మంత్రి

image

భద్రాద్రి జిల్లాలో ప్రతిపాదిత కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ సర్వే కోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 41లక్షలు డిపాజిట్ చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి తుమ్మలకు లేఖ రాశారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మంత్రి తుమ్మల లేఖ ద్వారా కోరారు. కాగా ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర సర్కార్ 950ఎకరాల స్థలం కేటాయించిన విషయం తెలిసిందే.