News March 20, 2025
లా అండ్ ఆర్డర్ అమలులో వనపర్తి ముందుండాలి: ఎమ్మెల్యే

లా అండ్ ఆర్డర్ అమలులో వనపర్తి జిల్లా ముందుండాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. వనపర్తిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ రావుల గిరిధర్‌తో కలిసి ప్రారంభించారు. మాట్లాడుతూ.. పోలీసు కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రజారోగ్యంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. అందులో భాగంగా వనపర్తి జిల్లాలో 502 పడకల ఆస్పత్రి మంజూరు చేశారన్నారు.
Similar News
News March 21, 2025
నల్గొండ: మొదటి రోజు పరీక్షకు 40 మంది విద్యార్థుల గైర్హాజరు

నల్గొండ జిల్లా వ్యాప్తంగా 105 సెంటర్లలో నేడు ప్రారంభమైన పదవ తరగతి మొదటి రోజు పరీక్షకి 18511 విద్యార్థులకు గాను 18471 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాధికారి బిక్షపతి తెలిపారు. మొత్తం 40 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. హాజరు శాతం 99.78 % నమోదు అయిందని, జిల్లా అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 49 సెంటర్లను సందర్శించారని తెలిపారు.
News March 21, 2025
జీవీఎంసీకి పన్ను చెల్లించిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం

విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం జీవీఎంసీకి ఈ ఏడాది పన్నును చెల్లించింది. మార్చి 31వ తేదీకి ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో శుక్రవారం జీవీఎంసీ గాజువాక జోన్ అధికారులకు పన్ను మొత్తం రూ.3,41,47,156 స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెల్లించింది. గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి, అసిస్టెంట్ కమిషనర్ రామ్ నారాయణ, ఆర్‌ఐ శివకు విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులు శుక్రవారం చెక్కు అందజేశారు.
News March 21, 2025
దుస్తులు మార్చుకుంటుండగా డోర్ తీశాడు: షాలినీ పాండే

ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘ఓ దక్షిణాది సినిమాలో నటిస్తున్న సమయంలో నా అనుమతి లేకుండానే ఓ డైరెక్టర్ నా క్యారవాన్ డోర్ తీశాడు. అప్పుడు నేను బట్టలు మార్చుకుంటున్నా. అతడిపై నేను గట్టిగా కేకలు వేయడంతో వెళ్లిపోయారు. డైరెక్టర్ తీరుతో నేను ఎంతో బాధపడ్డా’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కాగా షాలినీ పలు సినిమాల్లో నటించారు.