News March 20, 2025

ఈ అవార్డుతో నా హృదయం ఉప్పొంగింది: చిరు

image

UK పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో పార్లమెంట్ సభ్యులు, మంత్రుల నుంచి అవార్డు అందుకోవడంతో తన హృదయం ఉప్పొంగిపోయిందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘బ్రిడ్జ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఈ గౌరవం మరింత శక్తితో నా పనిని కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది. నా ప్రయాణంలో తోడున్న, నా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

Similar News

News March 28, 2025

బిల్లులు చెల్లించండి.. సీఎంకు కాంట్రాక్టర్ల లేఖ

image

AP: సీఎం చంద్రబాబుకు కాంట్రాక్టర్ల సంఘం లేఖ రాసింది. ప్రభుత్వ పనులు చేసిన గుత్తేదారులకు వెంటనే పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. ఆరేళ్లుగా బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపింది. ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఉగాదికల్లా రూ.2కోట్ల లోపు బిల్లులను చెల్లించాలని కోరింది.

News March 28, 2025

ఛార్జీలు పెంపు.. మే 1 నుంచి అమలు

image

ATM ఛార్జీలను పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. నెలవారీ ఉచిత లావాదేవీలు దాటాక ఒక్కో లావాదేవీపై రూ.23 వసూలు చేయనున్నారు. కస్టమర్లు సొంత బ్యాంక్ ఏటీఎంలో నెలకు 5 ట్రాన్సాక్షన్లు ఉచితంగా చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో సిటీలు అయితే 5 సార్లు, నాన్-మెట్రో సిటీలు అయితే 3 ట్రాన్సాక్షన్లకు ఛాన్స్ ఉంటుంది. వాటిని మించితే ప్రస్తుతం రూ.21 ఛార్జ్ చేస్తున్నారు. మే 1 నుంచి రూ.23 ఛార్జ్ చేయనున్నారు.

News March 28, 2025

ఏడాదిలో రూ.23,730 పెరిగిన గోల్డ్ ధర

image

దేశంలో బంగారం ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. గత ఏడాది ఏప్రిల్ 1న ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ రేటు(24 క్యారెట్లు) రూ.68,420 ఉండగా, ఇవాళ రూ.92,150కి చేరింది. ఏడాదిలో ఏకంగా రూ.23,730 పెరిగింది. <<15912228>>హైదరాబాద్‌లోనూ<<>> స్వచ్ఛమైన పసిడి ధర రూ.90,980 పలుకుతోంది. అంతర్జాతీయ ట్రేడ్ వార్స్ కారణంగా వృద్ధికి ఆటంకం కలుగుతుందనే ఆందోళనలు బంగారానికి డిమాండ్ పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

error: Content is protected !!