News March 20, 2025

VJA: సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలి: కలెక్టర్

image

విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలో గురువారం దాతలు ఏర్పాటు చేసిన ఉచిత తాగునీటి ఆర్వో ప్లాంట్‌, వైద్య శిబిరాలను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజల దాహర్తి తీర్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. సేవా కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు.

Similar News

News November 16, 2025

భద్రాద్రి: బస్సుల్లో రద్దీ.. ప్రయాణికుల ఇబ్బందులు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహాలక్ష్మీ ఉచిత బస్సు సౌకర్యం అమలయ్యాక, బస్సుల్లో అధిక రద్దీ వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు RTC బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కూడా తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. మరిన్ని సర్వీసులు పెంచాలని జిల్లా ప్రజలు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.

News November 16, 2025

ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు RTA స్ట్రాంగ్ వార్నింగ్

image

చేవెళ్ల బస్సు ప్రమాదం తరువాత RTA అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ప్రైవేటు వాహనాలను తనిఖీ చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రమేశ్ ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు వార్నింగ్ ఇచ్చారు. ప్రయాణికుల లగేజీ కాకుండా ఇతర లగేజీ తీసుకువెళితే చర్యలు తీసుకుంటామన్నారు. 30 ప్రాంతాల్లో 24 గంటలపాటు  ప్రత్యేక సిబ్బంది బస్సులను తనిఖీ చేస్తున్నారన్నారు.

News November 16, 2025

KMR: 3.19 మీటర్ల పైకి భూగర్భ జలాలు

image

కామారెడ్డి జిల్లాలో భూగర్భ జలాల స్థాయి గణనీయంగా పెరిగినట్లు జిల్లా భూగర్భ జల అధికారి సతీష్ తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది నీటి మట్టం ఏకంగా 3.19 మీటర్లు పెరిగిందని Way2Newsతో చెప్పారు. ఈసారి వర్షపాతం 1,402.7 మి.మీ. వర్షపాతం నమోదయ్యిందని.. ఏకంగా 58.4% అధిక వర్షపాతం పడిందన్నారు. జిల్లాలో అన్ని చెరువులు, కుంటల్లో నీళ్లు ఉండడంతో రబీ పంటలకు సాగుకు ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.