News March 20, 2025
మహానందిలో ఉద్యోగుల అంతర్గత బదిలీలు

మహానందిలోని పలు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్, ఏజెన్సీ ఉద్యోగుల స్థానాలను మారుస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. టెంపుల్ ఇన్స్పెక్టర్లుగా మల్లయ్య, సుబ్బారెడ్డిలను నియమించారు. ఉన్నత ఉద్యోగుల అండదండలు ఉండేవారికి కీలక బాధ్యతలు అప్పగించారని సమాచారం. శ్రీ మహానందీశ్వర, శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారి ఆలయాలతో పాటు ఇతర స్థానాల్లో ఉన్నత ఉద్యోగులకు అనుకూలమైన వారిని నియమించారని తెలుస్తోంది.
Similar News
News March 28, 2025
బాపట్లలో మానవత్వం చాటుకున్న మంత్రి

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మానవత్వం చాటుకున్నారు. బాపట్ల పరిధిలో శుక్రవారం ఓ ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అదే సమయానికి అటుగా వస్తున్న మంత్రి దుర్గేష్ వెంటనే స్పందించారు. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. డాక్టర్లకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టమేమీ జరగలేదని తెలిపారు.
News March 28, 2025
NZB: అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయి: కవిత

అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అప్పులు మొత్తం రూ. 4 లక్షల 42 వేలు అని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశామని దుష్ర్పచారం చేస్తున్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికైనా నిజాలు చెప్పాలన్నారు.
News March 28, 2025
మోదీ, చంద్రబాబు, పవన్ ఫొటోలకు పాలాభిషేకం

సూర్యలంక సముద్ర తీర అభివృద్ధికి రూ.97 కోట్లు మంజూరు కావడంపై కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈక్రమంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చిత్రపటాలకు సూర్యలంక సముద్రతీరం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ.. బాపట్లలో పర్యాటక రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.