News March 20, 2025

బుడగజంగం కులాన్ని ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం

image

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుడగజంగం కులాన్ని ఎస్సీల్లో చేర్చాలంటూ శాసనసభలో తీర్మానం చేసింది. దీనికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అసెంబ్లీ తీర్మానాన్ని ప్రభుత్వం త్వరలోనే కేంద్రానికి పంపనుంది.

Similar News

News January 17, 2026

మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు

image

TG: రాష్ట్రంలో 121 మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బీసీలకు 38, SC 17, ST 5, జనరల్ కి 61 స్థానాలు కేటాయించారు. ఎస్టీ కేటగిరీలో కల్లూరు, భూత్పూర్, మహబూబాబాద్, కేసముద్రం, ఎల్లంపేట్ ఉన్నాయి. ఎస్సీ జనరల్ కేటగిరీలో స్టేషన్ ఘన్‌పూర్, జమ్మికుంట, డోర్నకల్, లక్షెట్టిపేట, మూడుచింతలపల్లి, నందికొండ, మొయినాబాద్, కోహిర్, హుస్నాబాద్ ఉన్నాయి. పూర్తి వివరాలకు పైన ఫొటోలను స్లైడ్ చేయండి.

News January 17, 2026

ఇండోర్‌లో కలుషిత నీరు.. రూ.3 లక్షల మెషీన్ తెచ్చుకున్న గిల్

image

ఇండోర్ (MP)లో <<18729199>>కలుషిత నీటితో<<>> 24 మంది మరణించడంతో టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ గిల్ అప్రమత్తమయ్యారు. రూ.3 లక్షల విలువైన స్పెషల్ వాటర్ ప్యూరిఫికేషన్ మెషీన్‌ను తన వెంట తీసుకెళ్లారు. ఈ మెషీన్ RO, ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ నీటినీ శుద్ధి చేయగలదని నేషనల్ మీడియా పేర్కొంది. దాన్ని గిల్ తన గదిలో ఉంచుకోనున్నట్లు చెప్పింది. కాగా రేపు ఇండోర్‌లో భారత్-న్యూజిలాండ్ మూడో వన్డే జరగనుంది.

News January 17, 2026

వేప మందుల వాడకంలో మెళకువలు

image

వేప నూనె వాడేటప్పుడు సబ్బు ద్రావణం తప్పనిసరిగా వాడాలి. వేపనూనె, ద్రావణాలను సాయంత్రం చల్లితే ఫలితం బాగుంటుంది. ద్రావణాన్ని తయారు చేసిన తర్వాత వెంటనే పిచికారీ చేయాలి. ఆలస్యం చేయకూడదు. పంటకు కీడుచేసే పురుగుల గుడ్డు పొదిగే దశలో వేప మందును చల్లితే లార్వాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చు. బాగా ఎదిగిన లార్వాలు పంటను ఆశిస్తే వేప మందులను నిపుణుల సూచనలతో రసాయన మందులతో కలిపి వాడితే ఫలితాలు బాగుంటాయి.