News March 20, 2025
బాపట్ల: వ్యవసాయ కళాశాలలో రైతులకు శిక్షణ

బాపట్ల ఆచార్యఎన్.జి రంగా వ్యవసాయ కళాశాలలో పురుగుమందుల వాడకంపై రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ప్రిన్సిపల్ ప్రసన్నకుమారి, కీటక శాస్త్ర విభాగం డీన్ కోటేశ్వరరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రత్నకుమారి, పురుగు మందులు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి ప్రభావం గురించి తెలిపారు. ఇంకొల్లు మండలానికి చెందిన కొనికి, హనుమాజి పాలెం, సూదివారిపాలెం గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Similar News
News March 28, 2025
అల్లూరి జిల్లాలో భానుని ప్రతాపం

అల్లూరి జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. అడ్డతీగల, చింతూరు, దేవీపట్నం, గంగవరం, కొయ్యూరు, కూనవరం, రాజవొమ్మంగి, రంప, వీఆర్ పురంలో రాబోయే 48 గంటలు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కానుంది. దీంతో ఆ మండల వాసులు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
News March 28, 2025
ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఏపీ ప్రొఫెసర్

APకి చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్, VSU వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాస రావు ప్రపంచ దిగ్గజ శాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రపంచంలోని టాప్ 2% శాస్త్రవేత్తలలో ఒకరిగా ఆయన నిలిచినట్లు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో వెల్లడైంది. భౌతిక శాస్త్ర రంగానికి ఆయన చేసిన కృషికి దక్కిన ఫలితం ఇది. ఆయన వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌కు 250కి పైగా శాస్త్రీయ వ్యాసాలు రాసి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు.
News March 28, 2025
భార్యను తీసుకురావడానికి వెళ్తూ.. భర్త మృతి

భార్యను ఇంటికి తీసుకురావడానికి బైక్ పై వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందిన ఘటన సత్తుపల్లి పట్టణం శివారులో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లికి చెందిన మట్ల వెంకటేశ్వరరావు (35) భార్య భవాని సత్తుపల్లిలోని జీవి మాల్‌లో పనిచేస్తుంది. ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు వస్తుండగా ఓ పానీపూరి బండిని ఢీకొట్టాడు. సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.