News March 20, 2025
మోదీని కలిసిన ఎంపీ కుటుంబ సభ్యులు

ప్రధాని మోదీని ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సభ్యులు కలిశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మనుమరాళ్లతో ప్రధానమంత్రి కాసేపు గడిపారు. మెదక్ ఎంపీ దంపతులు, అల్లుడు కూతురు, మనమరాళ్లతో కలిసి ప్రధానమంత్రి కలిసి శాలువా కప్పి సన్మానించారు.
Similar News
News March 28, 2025
NZB: కల్లులో గడ్డి మందు కలుపుకొని సూసైడ్

నిజామాబాద్‌లో ఓ వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వివేకానంద కాలనీకి చెందిన కొత్త రాములు(58) గుమస్తాగా పని చేస్తున్నాడు. సదరు వ్యక్తికి అనారోగ్య సమస్యల కారణంగా ఈనెల 24వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కల్లులో గడ్డి మందు కలిపి తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా గురువారం మృతి చెందాడు.
News March 28, 2025
జనగామ: ప్రజలకు ప్రభుత్వం 90శాతం రాయితీ: కలెక్టర్

ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని అన్ని పట్టణ, స్థానిక సంస్థలకు (ULB) ఆస్తి పన్నుపై 90% బకాయి వడ్డీని మాఫీ చేసే వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) పథకాన్ని విస్తరించిన నేపథ్యంలో.. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద ఆస్తి పన్ను చెల్లించే వారికి పన్ను వడ్డీ బకాయిలపై ప్రభుత్వం 90శాతం రాయితీ వస్తుందన్నారు.
News March 28, 2025
జిన్నారం: ట్రాక్టర్ చక్రం కిందపడి బాలుడి మృతి

ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతిచెందిన ఘటన బొల్లారం PS పరిధిలో గురువారం చోటుచేసుకుంది. జిన్నారం మం. మాదారంలో ట్రాక్టర్ డ్రైవర్ గంగారం.. సందీప్(12)ను ట్రాక్టర్ ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో బాలుడు జారి కింద పడగా ట్రాక్టర్ వెనకాల చక్రం బాలుడిపైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే బాలుడు మృతిచెందినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. గంగారంపై పోలీసులు కేసు నమోదు చేశారు.