News March 20, 2025
పాలమూరు యూనివర్సిటీకి పెరిగిన కేటాయింపులు

పాలమూరు యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. యూనివర్సిటీ అధ్యాపకుల వేతనాలకు రూ.12.95 కోట్లు, పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి కోసం రూ.35 కోట్లు మంజూరు చేసింది. మొత్తం రూ.47.95 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా VC శ్రీనివాస్, రిజిస్టర్ చెన్నప్ప మాట్లాడుతూ.. యూనివర్సిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.
Similar News
News March 29, 2025
ఖమ్మం జిల్లాలో మండుతున్న ఎండలు

ఖమ్మం జిల్లాలో భానుడు రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. జిల్లాలో శుక్రవారం అత్యధికంగా ఖమ్మం ఖానాపురం పీఎస్, ముదిగొండ(M) పమ్మిలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అటు మధిరలో 41.2, రఘునాథపాలెం, కామేపల్లిలో 41.0, వైరాలో 40.8, కొణిజర్ల, ఖమ్మం(రూ) పల్లెగూడెంలో 40.6, చింతకాని, వేంసూరులో 40.1, సత్తుపల్లి 39.6, తిరుమలాయపాలెం 39.4, కల్లూరులో 38.8 డిగ్రీలు నమోదయ్యాయి.
News March 29, 2025
నారాయణపేట: అమ్మాయిలను వేధిస్తే కఠిన చర్యలు.. పోలీసుల WARNING

పాలమూరు పరిధి MBNR, NGKL, WNP, GDWL, NRPT జిల్లాల్లో పోక్సో చట్టంపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా అమ్మాయిలను వేధించినా.. అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో షీటీమ్ సభ్యుల నిఘా ఉంటుందన్నారు. ఆకతాయి పనులు చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. బాలికలు, యువతులు, మహిళలు వేధింపులకు గురైతే 100కు కాల్ చేయాలని సూచించారు. SHARE IT
News March 29, 2025
సాలూరు: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన సంఘటన సాలూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. సాలూరు రూరల్ ఎస్సై నరసింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కందులపథం పంచాయతీ చిన్నవలస గ్రామానికి చెందిన ఐశ్వర్య(20) చీపురువలస సమీపంలోని జీడి తోటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ఓ యువకుడిపై అనుమానంతో అతని కోసం గాలిస్తున్నారు.