News March 20, 2025
నిప్పుల కొలిమిలా ములుగు జిల్లా

ములుగు జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉ.10 గంటలకే జిల్లాలో నిప్పుల కొలిమిలా భానుడి భగభగలతో జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జిల్లాలో ఉష్ణోగ్రత 40@ డిగ్రీల వరకు చేరుతుండడంతో బయటికి వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో 11:30 గంటల వరకు నిర్వహిస్తుండగా, 12:30 గంటల వరకు ప్రభుత్వ పాఠశాలలో నడుస్తున్నాయి.
Similar News
News March 28, 2025
మోదీ, చంద్రబాబు, పవన్ ఫొటోలకు పాలాభిషేకం

సూర్యలంక సముద్ర తీర అభివృద్ధికి రూ.97 కోట్లు మంజూరు కావడంపై కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈక్రమంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చిత్రపటాలకు సూర్యలంక సముద్రతీరం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ.. బాపట్లలో పర్యాటక రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
News March 28, 2025
భారత్‌లోనూ భూకంప తీవ్రత

మయన్మార్‌లో సంభవించిన భూకంపం భారత్‌లోనూ ప్రభావం చూపుతోంది. మేఘాలయ, కోల్‌కతా, ఇంఫాల్, ఢిల్లీలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై ఇది 4 తీవ్రతతో నమోదైంది. దీంతో ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. మరోవైపు బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించడంతో థాయ్‌లాండ్ ప్రధాని షినవ్రత దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
News March 28, 2025
తెలుగువారే అగ్రస్థానంలో ఉండాలి: CM చంద్రబాబు

AP: భారతీయులు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండాలని, వారిలోనూ తెలుగువారు ముందుండాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘తెలుగువారు దూసుకెళ్లాలనేది నా స్వార్థం. దీని కోసం అమరావతిలో క్వాంటమ్ వాలీని ప్లాన్ చేస్తున్నాం. అందులోనే అన్ని సాంకేతికతల్ని ఏర్పాటు చేస్తాం. భారత ప్రభుత్వంతో పాటు ఐఐటీ మద్రాస్, ఐబీఎం, టీసీఎస్, ఎల్అండ్‌టీతో కలిసి పనిచేస్తున్నాం. ఇలాంటిది తీసుకురావడం దేశంలోనే తొలిసారి’ అని వెల్లడించారు.