News March 20, 2025

BRS ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించలేదు: దేవరకద్ర ఎమ్మెల్యే

image

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి గురువారం మదనాపురం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట మేరకు ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమన్నారు.   

Similar News

News March 29, 2025

అమరావతిలో చంద్రబాబు ఇల్లు.. ఏప్రిల్ 9న భూమి పూజ

image

AP: సీఎం చంద్రబాబు అమరావతిలో ఇల్లు నిర్మించుకోనున్నారు. దీనికి ఏప్రిల్ 9న భూమి పూజ చేయనున్నట్లు సమాచారం. గత ఏడాది చివర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలోని E6 రోడ్డుకు ఆనుకుని 5 ఎకరాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. ఈ స్థలానికి, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు మధ్య 2కి.మీ దూరం ఉంటుంది. కాగా పీఎం మోదీ చేతుల మీదుగా త్వరలో రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

News March 29, 2025

వరంగల్: సైనిక్ స్కూల్ విద్యార్థులకు అగ్నివీర్ ఉద్యోగాలు

image

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లోని సైనిక్ స్కూల్‌కు చెందిన 8 మంది డిగ్రీ విద్యార్థులు అగ్నివీర్(ఇండియన్ ఆర్మీ)లో ఉద్యోగాలు సాధించారు. పాఠశాలకు చెందిన ఈశ్వర్, ఆకాష్, అంజి, ఆనంద్, సాయికుమార్, రాజేందర్, అభిలాష్, శ్రావణ్ ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 8 మంది విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్ అభినందించారు.

News March 29, 2025

79వేల ఎస్సీ కుటుంబాలకు సోలార్ ప్యానల్స్: కలెక్టర్

image

ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా జిల్లాలో ఉన్న 79 వేల షెడ్యూల్డ్ కులాల కుటుంబాలకు ఏపీ ట్రాన్స్కో బ్యాంకర్ల సమన్వయంతో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ట్రాన్స్కో అధికారులు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి జిల్లాలో ఇప్పటి వరకు సూర్య ఘర్ పథకానికి అర్హులైన వారి జాబితాపై సమీక్షలు నిర్వహించారు. మూడు నెలల్లోగా ఏర్పాటు చేయాలన్నారు

error: Content is protected !!