News March 20, 2025

బాపట్ల కలెక్టర్ కీలక ఆదేశాలు

image

బాపట్ల జిల్లాను అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ వెంకట మురళి అధికారులను ఆదేశించారు. గురువారం బాపట్ల కలెక్టరేట్‌లో జిల్లా ప్రగతి నివేదికలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాను వ్యవసాయ అనుబంధ రంగాలలో, పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి చెందే దిశగా ప్రణాళికలు తయారు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాలో మత్స్య, ఆక్వా సంపదకు అన్ని వనరులున్నాయన్నారు.

Similar News

News March 28, 2025

బాపట్ల: మెగా డీఎస్సీకి హాజరయ్యే వారికి ఉచిత శిక్షణ

image

మెగా డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి శుక్రవారం ప్రకటన ద్వారా తెలిపారు. ఇందు కోసం దరఖాస్తులను బీసీ సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్లను అందజేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

News March 28, 2025

HYDలో నీటి ఎద్దడికి ఈ ఫొటో నిదర్శనం

image

ఈ దృశ్యం HYD శివారు మేడ్చల్‌లోని మూడుచింతలపల్లిలో నీటి ఎద్దడికి నిదర్శనం. మిషన్ భగీరథ నీరు ఇంటింటికీ రాకపోవడంతో అక్కడ నివసించే మహిళలు కాలినడకన చిన్నపిల్లలతో సహా బిందెలు, డబ్బాలతో దూరప్రాంతాల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. ఏడాది నుంచి ఈ సమస్య ఇలాగే ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులకు తమ గోడు వినిపించదా మమ్మల్ని పట్టించుకోరా? అని మండిపడుతున్నారు.

News March 28, 2025

పూరీ జగన్నాథ్ సినిమాకు నో చెప్పాను: రకుల్

image

తన కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాల్ని వదులుకున్నానని రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘కాలేజీలో చదువుకుంటున్న సమయంలో మోడలింగ్ చేశా. కన్నడ పరిశ్రమలో తొలి ఆఫర్ వచ్చింది. అది రిలీజయ్యాక పూరీ జగన్నాథ్ నుంచి ఫోన్ వచ్చింది. 70 రోజులు డేట్స్ కావాలన్నారు. అప్పటికి చదువుకుంటుండటంతో 4 రోజులు మాత్రమే ఇవ్వగలనన్నాను. అదే తరహాలో చాలా సినిమాల్ని వదులుకోవాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!