News March 20, 2025

నితిన్ గడ్కరీతో విశాఖ ఎంపీ శ్రీభరత్ భేటీ

image

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని విశాఖ ఎంపీ శ్రీభరత్ గురువారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం చేయాలని.. భోగాపురం విమానాశ్రయానికి మెరుగైన రహదారి నిర్మించాలని కోరారు. విశాఖ-ఖరగ్‌పూర్ కారిడార్‌పై చర్చించారు. ఈ రోడ్లు నిర్మాణం అయితే ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా ఉంటుందని కోరారు.

Similar News

News March 28, 2025

విశాఖ: ‘లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండాలి’

image

విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చి శుక్రవారం కమిషనర్ కార్యాలయంలో నెలవారి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నగరంలో యాక్టీవ్‌గా ఉన్న రౌడీ షీటర్లపై పెడుతున్న నిఘా చర్యలపై ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా పూర్తిగా నివారించాలని, గంజాయి ఎక్కడా ఉండరాదని ఆదేశించారు. రాత్రి పూట నిఘా పటిష్టం చేయాలని, ఉమెన్ సేఫ్టీ‌కి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News March 28, 2025

విశాఖలో ఉగాది వేడుక‌ల‌కు ఘ‌నంగా ఏర్పాట్లు: జేసీ

image

ఉగాది వేడుక‌ల‌ను సంప్ర‌దాయ‌బద్దంగా నిర్వ‌హించేందుకు ఘ‌నంగా ఏర్పాట్లు చేయాల‌ని విశాఖ జేసీ మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉగాది వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. ఈనెల 30న ఉడా చిల్డ్రన్ ఎరీనాలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. తెలుగు సంప్ర‌దాయం ఉట్టిప‌డే విధంగా నిర్వ‌హించాల‌న్నారు. వేడుకలు అన్ని శాఖల సమన్వయంతో జరగాలన్నారు.

News March 28, 2025

ఏప్రిల్ 1న పదో తరగతి సోషల్ పరీక్ష: విశాఖ డీఈవో

image

రంజాన్ మార్చి 31న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఈవో ప్రేమ్ కుమార్ శుక్రవారం తెలిపారు. అయితే పదో తరగతి సోషల్ పరీక్ష మార్చి 31వ తేదీన నిర్వహించనున్నట్లు ముందు హల్ టికెట్స్‌లో ప్రచురితం చేశారని, రంజాన్ పండుగ కావడంతో ఏప్రిల్ 1న పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలన్నారు.

error: Content is protected !!