News March 20, 2025

మహబూబ్‌నగర్: ‘పెండింగ్ లేకుండా ట్యాక్స్ చెల్లించాలి’ 

image

మహబూబ్‌నగర్ పురపాలక పరిధిలోని ప్రజలు మున్సిపల్ ట్యాక్స్ పెండింగ్ లేకుండా చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం మొత్తంగా రూ.1.92 లక్షల ట్యాక్స్ వసూలు చేసినట్టు వెల్లడించారు. స్వచ్ఛందంగా ప్రజలు తమ ఇంటి, వ్యాపార సముదాయాలకు సంబంధించిన టాక్స్‌లను చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News February 15, 2026

మన్యంకొండలో శేష వాహన సేవ

image

మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం రాత్రి శేష వాహన సేవ ఘనంగా నిర్వహించారు. స్వామివారిని గర్భాలయం నుంచి దక్షిణ కట్ట వరకు మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, అలహరి రామకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు.

News February 14, 2026

పాలమూరు: జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✒గద్వాల్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన AIFB విజేతలు
✒పాలమూరు: జాగృతి, AIFB ఉమ్మడి విజయం: జోజిరెడ్డి
✒జోగులాంబ జోన్‌కు మంచి పేరు తీసుకురావాలి: ఎస్పీ
✒పాలమూరుకు మహర్దశ.. రూ.3,175 కోట్లతో హైవే
✒ పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒పాలమూరులో ‘గ్లాసు’ ఖాళీ.. ప్రభావం చూపని జనసేన
✒గద్వాల్:జంపింగ్ ఎమ్మెల్యేలకు BRS ‘విప్’ సెగ
✒శివరాత్రి.. రేపు ఆలయాల వద్ద బందోబస్తు:SP

News February 14, 2026

MBNR: మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు

image

మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కందూరు రామలింగేశ్వర స్వామి దేవాలయం, మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, వీరన్నపేట పెద్ద శివాలయం, పిల్లల మర్రి వద్దనున్న శివాలయం వద్ద పటిష్ఠ భద్రత ఆ చర్యలు చేపట్టినట్టు ఎస్పీ వెల్లడించారు.