News March 20, 2025

కోహ్లీకి 2008లో రూ.12 లక్షలు.. ఇప్పుడు రూ.21కోట్లు

image

ఐపీఎల్ ఎంతో మంది యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసింది. 2008 నుంచి బెంగళూరు తరఫున ఆడుతున్న కోహ్లీ తొలి టోర్నీలో రూ.12 లక్షలు పొందితే ఇప్పుడు రూ.21 కోట్లు అందుకోనున్నారు. ముంబై జట్టు ప్లేయర్ రోహిత్ శర్మ రూ.3 కోట్ల నుంచి రూ.16 కోట్లకు చేరారు. ఇక 2008లో ధోనీకి ఉన్న క్రేజ్‌కు ఏకంగా రూ.6కోట్లు ఇవ్వగా ఇప్పుడు రూ.4కోట్లిస్తున్నారు. తొలి టోర్నీ నుంచి రహానే, మనీశ్, ఇషాంత్, జడేజా, అశ్విన్ కూడా ఉన్నారు.

Similar News

News February 3, 2026

కొడంగల్ ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్

image

కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి ఎన్విరామెంటల్ డిపార్ట్మెంట్ పచ్చ జెండా ఊపింది. వికారాబాద్ జిల్లా పరిధిలోనూ ఈ ప్రాజెక్టు ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి సైతం అధికారుల అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. దీని ద్వారా వికారాబాద్, నారాయణపేట, కొడంగల్, మక్తల్ నియోజకవర్గాల్లో మొత్తం కలిపి దాదాపుగా లక్ష ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు.

News February 3, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB-3, మంగళవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.12 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.27 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 3, 2026

ఈ నెల 6న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

image

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న క్వాంటం వ్యాలీకి ఈ నెల 6న శంకుస్థాపన జరగనుంది. దీని కోసం తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో 50 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు.