News March 20, 2025

109 కేసుల్లో 73 ఛేదించాం: విశాఖ సీపీ

image

విశాఖ సిటీలో ఫిబ్రవరి నెలలో నమోదైన 109 చోరీ కేసుల్లో 73 ఛేదించామని సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. రూ.33.21లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. రూ.60లక్షల విలువైన 419 ఫోన్లను రికవరీ చేశామన్నారు. 660.655 గ్రాముల బంగారం, 2.08 గ్రా. వెండి, రూ.2,73,575 నగదు,14 బైకులు, 2ల్యాప్‌టాప్‌లు, 2గేదెలు, 3లారీ బ్యాటరీలు, 57 సెంట్రింగ్ షీట్లను బాధితులకు అందజేశారు. మిగతా కేసులు ఛేదిస్తున్నామన్నారు.

Similar News

News March 28, 2025

విశాఖ: అన్నయ్య మందలించడంతో సూసైడ్

image

అన్నయ్య మందలించాడని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జై భారత్ నగర్‌లో ప్రతాప్ అనే యువకుడు ఉంటున్నాడు. ప్రతాప్ శుక్రవారం డ్యూటీకి వెళ్లకపోవడంతో ఆయన అన్నయ్య మందలించాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News March 28, 2025

పారిశ్రామికవేత్తలతో విశాఖ కలెక్టర్ మీటింగ్

image

పారిశ్రామికవేత్తలతో విశాఖ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ & ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ పలు అంశాలను పారిశ్రామికవేత్తలు, అధికారులతో చర్చించారు. ఇరువురి సమన్వయంతో పరిశ్రమలు అభివృద్ధి చెందాలని అయన కోరారు.

News March 28, 2025

విశాఖలో మేయర్ సీటుపై హీట్

image

విశాఖలో మేయర్ సీటుపై హీట్ రేగుతోంది. మేయర్‌పై అవిశ్వాస తీర్మాన వ్యవహారంపై వైసీపీ తామే నెగ్గుతామని ధీమా వ్యక్తం చేస్తుండగా పూర్తిస్థాయిలో బలం మాకే ఉందని కూటమి నాయకులు చెబుతున్నారు. మొత్తం 112 ఓట్లు ఉండగా 75 ఓట్లు అవిశ్వాసానికి వ్యతిరేకంగా నమోదు కావాలి. కూటమికి 64 మంది కార్పొరేటర్లు. 11 మంది ఎక్స్ అఫీషియ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా వైసీపీ, కూటమి ఎవరి ధీమా వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. 

error: Content is protected !!