News March 20, 2025
SRH ప్లే ఆఫ్స్ చేరడం కష్టం: మైకేల్ వాన్

ఐపీఎల్ 2025 సీజన్లో GT, MI, KKR కచ్చితంగా ప్లేఆఫ్స్ వెళ్తాయని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ జోస్యం చెప్పారు. నాలుగో బెర్త్ కోసం LSG, PBKS, SRH మధ్య తీవ్ర పోటీ నెలకొంటుందని అభిప్రాయపడ్డారు. గతేడాది ఫైనలిస్ట్ అయిన SRH ఈసారి ప్లేఆఫ్స్ చేరడం కష్టమేనని ఆయన పేర్కొన్నారు. అన్ని జట్ల కంటే గుజరాత్ టైటాన్స్ జట్టు గొప్పగా ఉన్నా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా నిలుస్తుందని అంచనా వేశారు.
Similar News
News January 7, 2026
త్వరగా పెళ్లి కావాలంటే.. పఠించాల్సిన మంత్రాలు

*కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్ యతీశ్వరీ|
నందగోప సుతం దేవీ పతిమే కురుతే నమః||
*అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః|
కామేశ బద్ద మాంగల్య సూత్ర శోభిత కందర||
*విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం|
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే||
*సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే|
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే||
News January 7, 2026
గ్రీన్లాండ్ కావాల్సిందే.. అవసరమైతే సైన్యాన్ని వాడతామన్న US

గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవడం తమకు చాలా ముఖ్యమని అమెరికా తేల్చి చెప్పింది. అవసరమైతే సైన్యాన్ని వాడతామని వైట్ హౌస్ హెచ్చరించడం సంచలనం రేపుతోంది. రష్యా, చైనాలను అడ్డుకోవడానికి ఈ ద్వీపం తమకు అవసరమని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని డెన్మార్క్, ఐరోపా దేశాలు స్పష్టం చేస్తున్నాయి. సరిహద్దుల విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకోబోమని యూరప్ నేతలు అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
News January 7, 2026
మేడారం జాతరకు కేసీఆర్‌ను ఆహ్వానించనున్న ప్రభుత్వం!

TG: మేడారం మహా జాతరకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. మంత్రి సీతక్క ఇవాళ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆయనకు ఆహ్వానపత్రిక అందజేయనున్నట్లు సమాచారం. అటు జాతరకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని సీతక్క కోరారు. నిన్న అసెంబ్లీ వద్ద వారికి ఇన్విటేషన్లు ఇచ్చారు. కాగా ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది.


