News March 20, 2025
శ్రీ సత్యసాయి: 171 మందికి బదిలీలు

జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 171 మందికి బదిలీ ప్రక్రియ నిర్వహించినట్లు డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లాలోని వివిధ క్యాడర్‌లలో పనిచేస్తున్న వారికి గురువారం బదిలీలు చేపట్టామన్నారు. 21 మంది ఏపీవోలు, 50 మంది కోఆర్డినేటర్స్, 18 మంది ఈసీ, 81 మంది టెక్నికల్ అసిస్టెంట్ల బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు.
Similar News
News March 28, 2025
ADB: ప్రతి పోలీస్ స్టేషన్‌లో రిసెప్షన్ల పాత్ర కీలకమైంది: ఎస్పీ

ప్రతి పోలీస్ స్టేషన్ నందు రిసెప్షన్ సెంటర్ల పాత్ర కీలకంగా వ్యవహరిస్తుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న రిసెప్షనిస్టూలతో సమావేశం ఏర్పాటు చేసి, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం ఏర్పాటు చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా కృషి చేయాలన్నారు.
News March 28, 2025
బిల్లులు చెల్లించండి.. సీఎంకు కాంట్రాక్టర్ల లేఖ

AP: సీఎం చంద్రబాబుకు కాంట్రాక్టర్ల సంఘం లేఖ రాసింది. ప్రభుత్వ పనులు చేసిన గుత్తేదారులకు వెంటనే పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. ఆరేళ్లుగా బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపింది. ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఉగాదికల్లా రూ.2కోట్ల లోపు బిల్లులను చెల్లించాలని కోరింది.
News March 28, 2025
అసిఫాబాద్: కానిస్టేబుల్‌ను అభినందించిన ఎస్పీ

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్‌లో వరుస దొంగతనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాగజ్ నగర్ పట్టణంలో ఇద్దరు దొంగలను పట్టుకోవడంలో కీలకపాత్ర వహించిన ఐడి పాలిటి కానిస్టేబుల్ రాజును జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అభినందించారు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్నందుకు పోలీస్ శాఖ తరపున ప్రశంస పత్రాన్ని అందించారు. వీరితో కాగాజ్‌నగర్ డిఎస్పీ రామానుజన్ ఉన్నారు.