News March 20, 2025

NRPT: బడ్జెట్ పత్రాలు దహనం చేసిన నేతలు

image

బడ్జెట్‌లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించారని నిరసన వ్యక్తం చేస్తూ గురువారం నారాయణపేట నర్సిరెడ్డి చౌరస్తాలో PDSU నాయకులు బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 7.57శాతం నిధులు కేటాయించారని, ఇది విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర అని అన్నారు. కనీసం 30 శాతం నిధులు కేటాయించి విద్యపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.

Similar News

News January 16, 2026

ఆరోగ్యం కోసం.. రోజూ ఉదయాన్నే ఇలా చేయండి

image

రోజును సరైన పద్ధతిలో ప్రారంభించడం ఆరోగ్యానికి కీలకమని నిపుణులు చెబుతున్నారు. 10 నిమిషాల పాటు చేసే చిన్న అలవాట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే నీరు తాగితే శరీరం హైడ్రేట్ అవుతుందని, ఖాళీ కడుపుతో కాఫీ/టీ తాగొద్దని సూచిస్తున్నారు. అదే విధంగా తేలికపాటి వ్యాయామం, మెడిటేషన్ చేస్తే గుండె, మెదడు పని తీరుతో పాటు పేగుల కదలికలను మెరుగుపరుస్తుందని వెల్లడించారు.

News January 16, 2026

కర్నూలు: మద్యం బాబులూ.. మీకు చిత్తడే..!

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అనుమానాస్పద వాహనాలను ఆపి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

News January 16, 2026

కనుమ రోజు ఏ దేవుడిని పూజించాలంటే?

image

కనుమ నాడు పశువుల దైవమైన కాటమరాజుని, సకల దేవతా స్వరూపమైన కామధేనువును భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు సూచిస్తున్నారు. పశుసంపదను చల్లగా చూడమని కోరుతూ ఊరి పొలిమేరల్లో మొక్కులు చెల్లిస్తారు. ఇలా చేస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్మకం. ఈ రోజున పశువులను అందంగా అలంకరించి, వాటికి దిష్టి తీసి ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తారు. పిండివంటల తర్వాత కనుమ నాటి మాంసాహార విందులతో పండుగ సందడి ముగుస్తుంది.